టిప్పర్ బీభత్సం.. 250 గొర్రెలు మృతి

| Edited By: Srinu

Jan 03, 2020 | 5:07 PM

వరంగల్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.  ఖానాపురం మండల పరిధిలోని పాకాల వాగు బ్రిడ్జిపై గురువారం రాత్రి సమయంలో టిప్పర్ వాహనం ఢీకొని 250 గొర్రెలు స్పాట్‌లో మృతి చెందాయి. మద్యం మత్తుతో వాహన డ్రైవర్ చేసిన తప్పిదం..ఆ గొర్రెల యజమానుల జీవితాలను రోడ్డున పడేసింది.  వివరాల్లోకి వెళ్తే.. పాకాల, వాజేడు మన్యం ప్రాంతం చుట్టుపక్కన ఉండే మహేశ్వరం గ్రామానికి చెందిన గొర్రెల యజమానులు సుమారు 600 గొర్రెలు మేపుకొని రాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్నారు. ఈ సమయంలో […]

టిప్పర్ బీభత్సం.. 250 గొర్రెలు మృతి
Follow us on

వరంగల్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.  ఖానాపురం మండల పరిధిలోని పాకాల వాగు బ్రిడ్జిపై గురువారం రాత్రి సమయంలో టిప్పర్ వాహనం ఢీకొని 250 గొర్రెలు స్పాట్‌లో మృతి చెందాయి. మద్యం మత్తుతో వాహన డ్రైవర్ చేసిన తప్పిదం..ఆ గొర్రెల యజమానుల జీవితాలను రోడ్డున పడేసింది.  వివరాల్లోకి వెళ్తే.. పాకాల, వాజేడు మన్యం ప్రాంతం చుట్టుపక్కన ఉండే మహేశ్వరం గ్రామానికి చెందిన గొర్రెల యజమానులు సుమారు 600 గొర్రెలు మేపుకొని రాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్నారు. ఈ సమయంలో అక్రమంగా మట్టిని తరలిస్తోన్న ఓ టిప్పర్ డ్రైవర్..గొర్రెలను గుద్దుకుంటూ వాహనాన్ని నడిపాడు. దీంతో 250 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 100 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. వాటిని ఢీకొట్టాక కూడా టిప్పర్‌ను ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించాడు డ్రైవర్. కానీ గొర్రెల మృతదేహాలు టిప్పర్ టైర్ల మధ్య ఇరుక్కుపోవడంతో వాహనం ముందుకెళ్లడం వీలుకాలేదు. దీంతో టిప్పర్ అక్కడే వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. సుమారు రూ.18 లక్షల నష్టం వాటిల్లిందని గొర్రెల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఖానాపురం పోలీసులు..దర్యాప్తు ప్రారంభించారు.

కాగా అక్టోబర్ 22, 2017 న భువనగిరి సమీపంలో 400 గొర్రెలు రైలును ఢీకొనడంతో చనిపోయాయి. కోల్‌కతాలోని హౌరాకు వెళుతున్న సూపర్‌ఫాస్ట్ ఫలక్నుమా ఎక్స్‌ప్రెస్ భువనగిరి  రైల్వే ట్రాక్‌ల దగ్గర మేత కోసం వెళ్లిన గొర్రెల మందను ఢీకుంది.