గుర్రం బాబా లీలలు..కోళ్లు కూడా మాయం !

|

Dec 20, 2019 | 2:58 PM

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకూ అభివృద్ధి చెందుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రజలు మూఢ విశ్వాసాలలో మగ్గుతున్నారు. గ్రామీణులు, గిరిజనుల అమాయకత్వాన్ని మూఢనమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు దొంగలు చెలరేగిపోతున్నారు. తాజాగా మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలోని చాలా గ్రామాల్లో.. ఓ దొంగ బాబా అట్టహాసంగా అశ్వం పై వచ్చి మాయమాటతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ కు చెందిన పాత నేరస్తుడు పర్వతం అప్పయ్య.. తాను గుర్రం బాబా నని […]

గుర్రం బాబా లీలలు..కోళ్లు కూడా మాయం !
Follow us on

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకూ అభివృద్ధి చెందుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రజలు మూఢ విశ్వాసాలలో మగ్గుతున్నారు. గ్రామీణులు, గిరిజనుల అమాయకత్వాన్ని మూఢనమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు దొంగలు చెలరేగిపోతున్నారు. తాజాగా మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలోని చాలా గ్రామాల్లో.. ఓ దొంగ బాబా అట్టహాసంగా అశ్వం పై వచ్చి మాయమాటతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు.

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ కు చెందిన పాత నేరస్తుడు పర్వతం అప్పయ్య.. తాను గుర్రం బాబా నని చెప్పుకుంటూ గుర్రంపై స్వారీ చేస్తూ తండాలలోని ప్రతి ఇల్లు కలియతిరుగుతూ అమాయక గిరిజన ప్రజలను తన మాయమాటలతో ప్రలోభ పెట్టి, భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. మండలంలోని బోడ తండ, కౌసలి  బోడ తండాలలో పర్యటించిన దొంగబాబా “మీ ఇంట్లో దోషం ఉంది, శని తాండవిస్తుంది, అంటూ  పిల్లలు లేని దంపతులకు పూజలు చేస్తే పిల్లలు  కలుగుతారని, ఉన్న రోగాలు నయం చేస్తానని’ వారిని నమ్మబలికించాడు. పూజలు చేస్తే బాధలు తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మించాడు. దోశ నివారణ చేయాలని లేకుంటే ప్రాణాలకే ప్రమాదమంటూ భయానికి గురిచేశాడు. దీంతో కొందరు బాబా మాయమాటలు నమ్మి దోష నివారణ కోసం ఒక్కో కుటుంబం నుంచి రూ.10వేలు, రూ.5 వేలు, రూ.3 వేలు వరకు తీసుకున్నాడు. అంతేకాదు.. డబ్బులు లేని వాళ్ల దగ్గర నాటుకోళ్లను తీసుకుని ఉడాయిస్తున్నాడంటూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.