అర్జెంటీనాలో దారుణం.. ఆందోళనకరంగా ఆత్మహత్యల సంఖ్య

అర్జెంటీనాలో ఆత్మహత్యల సంఖ్య ముందెన్నడూ లేనంతగా పెరిగింది. ఈ అంశంపై చర్చను లేవదీయడానికి బాధిత కుటుంబ సభ్యులు, మానసిక నిపుణులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అర్జెంటీనాలో ప్రతి 1,00,000 మందికి 12 మంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.  పొరుగు దేశమైన ఉరుగ్వేలో ఈ సంఖ్య మరింత ఎక్కువ కావడం ఆందోళనకు గురి చేస్తోంది. అక్కడ ప్రతి 1,00,000 మందికి 19 కేసులు నమోదవుతున్నాయి.

అర్జెంటీనాలో దారుణం.. ఆందోళనకరంగా ఆత్మహత్యల సంఖ్య
High Suicide Rates Cause Alarm In Argentina

Updated on: Sep 21, 2026 | 7:17 PM

ప్రభుత్వ లెక్కల ప్రకారం 2017లో 3,304 మంది ఆత్మహత్యకు పాల్పడితే, ఆ సంఖ్య ఇప్పుడు 5,209కి పెరిగింది. అంటే దాదాపు 57 శాతం ఎక్కువైంది. 15 నుంచి 34 ఏళ్ల  వయసున్న యువతలో రోడ్డు ప్రమాదాల కంటే ఆత్మహత్యలే ప్రాణాలు తీస్తున్నట్లు  క్రిమినల్ పాలసీ అబ్జర్వేటరీ (OPC), భద్రతా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా తెలిపాయి. దాంతో తాజాగా  బ్యూనస్ ఎయిర్స్ లో పదుల సంఖ్యలో బాధిత కుటుంబ సభ్యులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.  ఆత్మహత్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, సమస్య గురించి మాట్లాడటమే దానిని నివారించడానికి మొదటి మార్గం అని 2023లో తన కూతురిని కోల్పోయిన గ్రాసిలా సలాజార్ తెలిపారు.

ఆర్థిక ఇబ్బంది, నిరుద్యోగంతో యువత నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఒంటరిగా ఉండటం,  జూదం యాప్‌లకు బానిస కావడం కూడా కారణాలుగా చెబుతున్నారు.  39 ఏళ్ల యెసికా బెక్కరియా  తన సోదరుడు లూకాస్ బెక్కరియా ఫోటో ముందు కనీళ్లు పెట్టుకుంది. బస్సు డ్రైవర్‌గా పనిచేసిన లూకాస్, విడాకుల తర్వాత 13 ఏళ్ల కూతురిని చూసుకున్నాడనీ, 2024లో తన 31 ఏళ్ల వయసులో తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నట్లు యెసికా తెలిపింది

పరానా నది వంతెన పై నుంచి దూకి ఆత్మహత్యలకు పాల్పడతున్న వారు ఎక్కువని, దీనిని నివారించడానికి  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని  ఈశాన్య అర్జెంటీనాలోని  కొరియెంట్స్ ప్రావిన్స్ కమ్యూనిటీ తీర్మానం చేసింది. వంతెనపై రక్షణ గోడలు (బారియర్లు), లైటింగ్ ఏర్పాట్లు చేసి సీసీ కెమెరాల నిఘాను పెంచాలని,  అత్యవసర సమయాల్లో సంప్రదించడానికి ప్రత్యేక ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచాలని తీర్మానంలో ప్రభుత్వాన్ని కోరారు.

ప్రజల డిమాండ్

ఆత్మహత్య ఆలోచనలతో బాధపడేవారిలో కొన్ని ప్రవర్తనా మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు, సమయానికి తినడం మానేస్తారు మరియు ఎవరితోనూ మాట్లాడకుండా చాలా సైలెంట్‌గా ఉంటారు. అంతేకాకుండా, “ఇక బతికి లాభం లేదు, చనిపోతే ఈ బాధలు తప్పుతాయి” అంటూ ముందుగానే పరోక్షంగా తమ మనసులోని ఆవేదనను బయటపెడుతుంటారు. ఇలాంటి లక్షణాలున్న వారిని కుటుంబ సభ్యులు ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి, వారికి ధైర్యం చెప్పి అవసరమైతే కౌన్సిలింగ్ ఇప్పించడం చాలా ముఖ్యం. అర్జెంటినాలో పెరుగుతున్న ఆత్మహత్యలను అరికట్టడానికి ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు, బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.  కౌన్సెలింగ్ ఇవ్వాలని, మానసిక ఒత్తిడి నుంచి బయటపడేయడానికి సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us