Teacher Missing: గుంటూరు జిల్లాలో కలకలం రేపుతున్న స్కూల్ టీచర్ మిస్సింగ్.. కారణాలు ఇలా ఉన్నాయి..

Teacher Missing: గుంటూరు జిల్లాలో స్కూల్ టీచర్ మిస్సింగ్ మిస్టరీగా మారింది. 11న ఉదయం స్కూటీపై వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. తుళ్ళూరు

Teacher Missing: గుంటూరు జిల్లాలో కలకలం రేపుతున్న స్కూల్ టీచర్ మిస్సింగ్.. కారణాలు ఇలా ఉన్నాయి..

Updated on: Feb 13, 2021 | 10:00 AM

Teacher Missing: గుంటూరు జిల్లాలో స్కూల్ టీచర్ మిస్సింగ్ మిస్టరీగా మారింది. 11న ఉదయం స్కూటీపై వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. తుళ్ళూరు మండలం మందడం జిల్లాపరిషత్‌ స్కూల్‌లో ఝాన్సీరాణి హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. మంగళగిరిలో తెనాలి ఫ్లైఓవర్‌ దగ్గర ఎన్‌.ఎస్‌.ఆర్‌. ప్లాజా అపార్టుమెంటులో ఝాన్సీరాణి, ఆమె భర్త వీరాంజనేయులు, కొడుకు కలిసి ఉంటున్నారు.11న ఉదయం స్కూటీపై ఆమె స్కూల్‌కు వెళ్లారు. ఆ రోజు మధ్యాహ్నం వీరాంజనేయులు తన భార్యతో మొబైల్‌లో మాట్లాడారు.

సాయంత్రం స్కూటీపై మంగళగిరి వచ్చిన ఆమె శ్రీలక్ష్మీనృసింహస్వామి గుడి తూర్పు గాలిగోపురం ఎదురు ఎస్‌బీఐ ఏటీఎం పక్కనున్న షాప్ దగ్గర స్కూటీ పార్క్ చేశారు. తాళం షాపు యజమానికి ఇచ్చి, తన భర్త వచ్చి వాహనాన్ని తీసుకెళతారని చెప్పి వెళ్లిపోయారు. ఝాన్సీ రాత్రికి ఇంటికి రాకపోవడంతో కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లి గురువారం సాయంత్రం నుంచి ఇంటికి రాలేదని చెప్పారు. ఆమె మిస్సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె బ్రౌన్, బిస్కట్‌ కలర్‌ కాటన్‌ చీర ధరించి ఉన్నారని.. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌‌కు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.

కీచక ఉపాధ్యాయులకు గుణపాఠం: విద్యార్థినిలను లైంగికంగా వేధించిన టీచర్‌తోపాటు బ్యాచ్ మొత్తానికి తగినశాస్తి