India vs England 2nd Test, Pitch Report : భారత్- ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు.. స్పిన్‌కు అనుకూలించే పిచ్ ఏర్పాటు చేసిన బీసీసీఐ

India vs England 2 nd Test : ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో పరాజయాన్ని మరచి కోహ్లి సేన మరో సమరానికి సిద్ధమైంది. భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఇక్కడి ఎం.ఎ.చిదంబరం

India vs England 2nd Test, Pitch Report : భారత్- ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు.. స్పిన్‌కు అనుకూలించే పిచ్ ఏర్పాటు చేసిన బీసీసీఐ
Follow us

|

Updated on: Feb 13, 2021 | 8:50 AM

India vs England 2nd Test : ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో పరాజయాన్ని మరచి కోహ్లి సేన మరో సమరానికి సిద్ధమైంది. భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఇక్కడి ఎం.ఎ.చిదంబరం స్టేడియంలో శనివారం నుంచి రెండో టెస్టు మ్యాచ్‌ జరగనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో నిలవాలంటే సిరీస్‌లో కనీసం రెండు టెస్టులు గెలవాల్సిన భారత్‌ దానిని ఇక్కడే మొదలు పెట్టాల్సి ఉంది. మరోవైపు ఈ టెస్టునూ నెగ్గితే సిరీస్‌ చేజార్చుకునే ప్రమాదం నుంచి రూట్‌ సేన సురక్షితంగా బయపడుతుంది.

అయితే తొలి టెస్టుతో పోలిస్తే బీసీసీఐ భిన్నమైన పిచ్‌ ఏర్పాటు చేసింది. మొదటి రోజు నుంచే స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. అయితే ఐదు రోజులు ఇలాంటి పిచ్‌ మనగలదా అనేది ఆసక్తికరం. ఈ నేపథ్యంలో టాస్‌ మరోసారి కీలకం కానుంది. మ్యాచ్‌కు వర్షం నుంచి ముప్పు లేదు. ఇక ఈ మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టు తమ 12 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. మొదటి టెస్టులో ఇంగ్లండ్‌ ఘన విజయంలో సీనియర్‌ పేసర్‌ అండర్సన్‌ రెండో ఇన్నింగ్స్‌లో వేసిన అద్భుత స్పెల్‌ పాత్ర ఎంతో ఉంది. ఆ ప్రదర్శన అనంతరం రెండో టెస్టులో కూడా తాను ఆడాలని ఉత్సాహంగా ఉన్నట్లు అండర్సన్‌ చెప్పాడు. అయితే ఇంగ్లండ్‌ బోర్డు మాత్రం తమ ‘రొటేషన్‌ పాలసీ’ని ఏమాత్రం మార్చేది లేదని కచ్చితంగా చెప్పేసింది. అతని స్థానంలో మరో సీనియర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ జట్టులోకి వస్తాడని తెలిపింది.

ఇక టీమ్ఇండియా విషయానికి వస్తే.. అశ్విన్‌ మినహా మిగిలిన ఇద్దరు స్పిన్నర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడం కూడా తొలి టెస్టులో భారత జట్టు పరాజయానికి కారణాల్లో ఒకటి. ఆ మ్యాచ్‌కు అనూహ్యంగా గాయపడి ఆటకు దూరమైన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ పూర్తిగా కోలుకొని ఈ మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. అతను టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఖాయమైంది. షాబాజ్‌ నదీమ్‌ స్థానంలో అక్షర్‌ ఆడతాడు. అయితే కుల్దీప్‌ యాదవ్‌కు తుది జట్టులో చోటుపైనే ఉత్కంఠ నెలకొంది.

తుది జట్ల వివరాలు (అంచనా) భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), గిల్, రోహిత్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, అక్షర్, ఇషాంత్, బుమ్రా, సుందర్‌/ కుల్దీప్‌. ఇంగ్లండ్‌: రూట్‌ (కెప్టెన్‌), సిబ్లీ, బర్న్స్, లారెన్స్, స్టోక్స్, పోప్, ఫోక్స్, అలీ, బ్రాడ్, లీచ్, వోక్స్‌/స్టోన్‌.

Anjum Chopra : వారిద్దరూ మంచి మిత్రులు.. వారి మధ్య విభేదాలు కలిగించవద్దంటున్న మహిళా క్రికెట్‌ జట్టు మాజీ సారథి..