కిలాడీ లేడీ..ఏం చేసిందంటే..

| Edited By: Srinu

Jan 30, 2020 | 4:56 PM

దొంగలు రోజురోజుకు తెలివిమీరిపోతున్నారు. జగిత్యాలలో కూరగాయల మార్కెట్‌కు వచ్చిన ఓ కిలాడీ.. ఏకంగా 5 తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించింది. కూరగాయలు అమ్ముకునే మల్లవ్వ అనే మహిళా రైతు దగ్గరకు వచ్చి.. ఓ బంగారు ఆభరణం తీసుకుని 2వేలు ఇవ్వు అంతా మంచే జరుగుతుందంటూ మాయమాటలు చెప్పింది. కిలాడీ మాటలు విన్న మల్లవ్వ కాసేపు మాటలు కలిపింది. తర్వాత తన దగ్గరున్న పుస్తెలతాడు, కమ్మలు, అన్ని కలిపి ఆ కిలాడీ చేతుల్లో పెట్టింది. కాసేపు అక్కడే ఉండి […]

కిలాడీ లేడీ..ఏం చేసిందంటే..
Follow us on

దొంగలు రోజురోజుకు తెలివిమీరిపోతున్నారు. జగిత్యాలలో కూరగాయల మార్కెట్‌కు వచ్చిన ఓ కిలాడీ.. ఏకంగా 5 తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించింది. కూరగాయలు అమ్ముకునే మల్లవ్వ అనే మహిళా రైతు దగ్గరకు వచ్చి.. ఓ బంగారు ఆభరణం తీసుకుని 2వేలు ఇవ్వు అంతా మంచే జరుగుతుందంటూ మాయమాటలు చెప్పింది.

కిలాడీ మాటలు విన్న మల్లవ్వ కాసేపు మాటలు కలిపింది. తర్వాత తన దగ్గరున్న పుస్తెలతాడు, కమ్మలు, అన్ని కలిపి ఆ కిలాడీ చేతుల్లో పెట్టింది. కాసేపు అక్కడే ఉండి అందరితో మాట్లాడుతూనే.. నెమ్మదిగా జారుకుంది.. ఆ దృశ్యాలన్నీ సీసీ అక్కడి కెమెరాలో రికార్డయ్యాయి. అయితే నిందితురాలు ఎవరన్న దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు.