
ఓ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇందన ట్యాంక్ పేలి నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటన రాయగఢ్ జిల్లాలోని స్టీల్ ప్లాంట్‌లో జరిగింది. ‘స్క్రాప్ యార్డులో పాత డిజిల్ ట్యాంక్ ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేస్తుండగా పేలుడు సంభవించింది. జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ట్యాంకులో కొంత డిజిల్ గానీ, గ్యాస్ కానీ ఉండవచ్చునని, అందువల్లే ప్రమాదం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో రాయ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించగా మరొ ఇద్దరిని రాయగఢ్‌లోని మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. జరిగిన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది.