Andhra Pradesh: అయ్యో అయ్యప్పా.! ఆంధ్రప్రదేశ్‌లో దారుణం. ఆటో బోల్తాపడి భక్తులు మృతి.

ఆంధ్రప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆటో బోల్తాపడడంతో నలుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందారు. ఈ హృదయ విదారకర సంఘటన బాపట్ల జిల్లాలోని వేమూరు మండలం జంపని దగ్గర చోటు చేసుకుంది. మృతులంతా కృష్ణాజిల్లా వాసులుగా గుర్తించారు...

Andhra Pradesh: అయ్యో అయ్యప్పా.! ఆంధ్రప్రదేశ్‌లో దారుణం. ఆటో బోల్తాపడి భక్తులు మృతి.
Accident

Updated on: Dec 05, 2022 | 8:44 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆటో బోల్తాపడడంతో నలుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందారు. ఈ హృదయ విదారకర సంఘటన బాపట్ల జిల్లాలోని వేమూరు మండలం జంపని దగ్గర సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మృతులంతా కృష్ణాజిల్లా వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో మొత్తం నలుగురు మరణించగా, మరో 10 మందికి గాయాలయ్యాయి, గాయాల పాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయ్యప్ప భక్తులు టాటా ఏస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 23 మంది ఉన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని తెనాలి ఆసుప్రతికి తరలించారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.