Crime Video: మద్యం మత్తులో ఆడి కారు బీభత్సం… ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురికి గాయాలు

ఢిల్లీలో ఆడి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ ఆడికారుతో ఫుట్‌పాత్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురికి గాయాలు అయ్యాయి. వసంత్ విహార్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులంతా రాజస్థాన్‌కి చెందినవారుగా...

Crime Video: మద్యం మత్తులో ఆడి కారు బీభత్సం... ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురికి గాయాలు
Audi Car Accident In Delhi

Updated on: Jul 13, 2025 | 11:27 AM

ఢిల్లీలో ఆడి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ ఆడికారుతో ఫుట్‌పాత్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురికి గాయాలు అయ్యాయి. వసంత్ విహార్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులంతా రాజస్థాన్‌కి చెందినవారుగా గుర్తించారుర. ఢిల్లీలో కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు బాధితులు. 40 ఏళ్ల ఉత్సవ్ శేఖర్ మద్యం సేవించి కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు.

బాధితులు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న సమయంలో కారు వారిని ఢీకొట్టింది. ఎనిమిదేళ్ల బాలికతో సహా ఐదుగురు వ్యక్తులపై ఆడి కారును తాగి నడిపాడు. జూలై 9న తెల్లవారుజామున 1:45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి, గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు స్థానికులు.

బాధితులను లాధి (40), ఆమె ఎనిమిదేళ్ల కుమార్తె బిమ్లా, భర్త సబామి అలియాస్ చిర్మా (45), రామ్ చందర్ (45) మరియు అతని భార్య నారాయణి (35)గా గుర్తించారు, వీరందరూ రాజస్థాన్ నివాసితులు. శివ క్యాంప్ ముందు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న బాధితులపై తెల్లటి ఆడి కారు దూసుకెళ్లిందని ప్రాథమిక దర్యాప్తులో ప్రత్యక్ష సాక్షురలు వెల్లడించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

 

వీడియో చూడండి: