మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం.. పడవ మునిగి ఐదుగురు దుర్మరణం.. ఆలయానికి వెళ్లి వస్తుండగా ఘటన..!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అగర్ మల్వా జిల్లాలోని పటేటీ తిల్లారి డ్యామ్ లో మునిగి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం.. పడవ మునిగి ఐదుగురు దుర్మరణం.. ఆలయానికి వెళ్లి వస్తుండగా ఘటన..!

Updated on: Dec 03, 2020 | 7:52 AM

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అగర్ మల్వా జిల్లాలోని పటేటీ తిల్లారి డ్యామ్ లో మునిగి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు పచేటీ డ్యామ్ లో మునిగి విగతజీవులుగా మారారు. ఈ సంఘటన జరిగిన వెంటనే, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కకరికి రూ.4లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. డ్యామ్ లో మునిగి మరణించిన ఐదుగురి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4లక్షల చొప్పున, అంత్యక్రియల కోసం మరో రూ.5వేలను ఇస్తామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. ముగ్గురు పిల్లలతోపాటు ఇద్దరు మహిళలు డ్యామ్ మునిగి మరణించారని, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ బృందం మృతదేహాలను వెలికితీసిందని జిల్లా కలెక్టరు అవదేష్ శర్మ చెప్పారు.


లఖా ఖేది గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలతో కలిసి మర పడవలో తిల్లారి డ్యామ్ దాటి మరొక వైపు ఉన్న ఆలయానికి బయలుదేరారు. ప్రమాదవశాత్తు పడవ మధ్యలో మునిగిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రంకన్య (35), సునీత (40) జయ (13) ఆల్కా (13), అభిషేక్ (10)లు నీటి మునిగిపోయి మృత్యువాతపడ్డారు. ఐదుగురు మృతదేహాలను ఒక రెస్క్యూ టీం గుర్తించింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.