Firing in Delhi: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి తుపాకీ చప్పులతో దద్దరిల్లింది. పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్‌లో 10రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. ఓ కారులో ఉన్న వ్యక్తులపై విచ్చలవిడిగా ఫైరింగ్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. జనావాసాల్లో జరిగిన కాల్పులతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. సీసీ ఫుటేజ్‌లో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్ ప్రాంతంలో 10 రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయి, ఇందులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో భద్రతను పెంచామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏప్రిల్ 16న నార్త్ వెస్ట్ ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో జరిగిన ఘర్షణల తర్వాత పశ్చిమ ఢిల్లీలో కాల్పుల ఘటన కొన్ని వారాల తర్వాత తెరపైకి వచ్చింది. ఈ హింసాకాండలో పోలీసులతో పాటు పలువురు గాయపడ్డారు. ఈ సందర్భంగా రాళ్లు రువ్వి కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. ఒకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. పరస్పర శత్రుత్వం కారణంగానే ఈ కాల్పులు జరిగినట్లు చెబుతున్నారు. గాయపడిన వారిని అజయ్ చౌదరి, జస్సా చౌదరిగా గుర్తించారు. అజయ్ చౌదరి కాషోపూర్ మండి అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.
An incident of more than 10 rounds of firing has left 2 injured in the Subhash Nagar area of West Delhi. Security forces deployed: Delhi Police pic.twitter.com/AkyqDVed5v
— ANI (@ANI) May 7, 2022