Fire Accident In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అర్థరాత్రి 12:45 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో సుమారు 250 ఫర్నిచర్, హార్డ్‌వేర్ దుకాణాలకు మంటలు వ్యాపించాయి.
దీంతో వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 32 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక మంటల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించారు. ఈ విషయమై ఫైర్ సర్వీసెస్ అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్ రాజేశ్ శుక్లా మాట్లాడుతూ.. ‘శనివారం అర్ధరాత్రి 12.45 గంటలకు మంటలు చెలరేగాయని సమాచారం వచ్చింది. దీంతో సమాచారం అందగానే 32 ఫైర్ ఇంజన్లను సంఘటన స్థలానికి తరలించాము. ఆదివారం వేకువ జామున 3గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తీసుకొచ్చాం. రెస్క్యూ ఆపరేషన్‌లో ఎనిమిది మందిని రక్షించాం. ప్రమాదంలో సుమారు 250 ఫర్నిచర్, హార్డ్‌వేర్ దుకాణాలకు మంటలు వ్యాపించగా.. అందులోని సామగ్రి అగ్నికి ఆహుతైంది’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే అగ్ని ప్రమదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Delhi: Eight people rescued from the fire in a furniture market in Shastri Park. “Fire was reported at 12:45 am & involved around 250 furniture & hardware shops in the market. 32 fire tenders were pressed into action & fire was brought under control by 3 am,” a fire official said pic.twitter.com/Uv1Md4mMcg
— ANI (@ANI) April 10, 2021
China mine Accident: చైనాలో పోటెత్తిన వరదలు.. బొగ్గు గనిలో గల్లంతైన 21 మంది మైనర్లు..