Fire Accident: రాజేంద్రనగర్‌లో అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన అపార్ట్‌మెంట్‌ వాసులు

Fire Accident: అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదశాత్తు, షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఎన్నో ప్రమాదాలు జరిగి ఆస్తి మొత్తం బుగ్గిపాలవుతోంది...

Fire Accident: రాజేంద్రనగర్‌లో అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన అపార్ట్‌మెంట్‌ వాసులు

Updated on: Jan 16, 2022 | 12:45 PM

Fire Accident: అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదశాత్తు, షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఎన్నో ప్రమాదాలు జరిగి ఆస్తి మొత్తం బుగ్గిపాలవుతోంది. ఇక తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ హైదరగూడలో ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 5వ అంతస్తులోని 521 ప్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్న వాసులంతా భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. అయితే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ప్లాట్‌లో ఎవ్వరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయ్యింది. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.