తాను తెచ్చుకున్న మద్యం తాగేశాడని.. కొడుకుని కొట్టి చంసిన తండ్రి! ఈ ఘోరం ఎక్కడ జరిగిందంటే..?

మహారాష్ట్రలోని అమరావతి లో విషాదకర ఘటన. 65 ఏళ్ల హిరామన్ దుర్వే తన కొడుకు దిలీప్ తాగినందుకు కోపం తో చెక్క కర్రతో కొట్టి చంపాడు. దిలీప్ నిరుద్యోగి, మద్యపాన వ్యసనం కలిగి ఉన్నాడు. పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

తాను తెచ్చుకున్న మద్యం తాగేశాడని.. కొడుకుని కొట్టి చంసిన తండ్రి! ఈ ఘోరం ఎక్కడ జరిగిందంటే..?
Representative Image

Updated on: Jun 03, 2025 | 6:24 PM

తన కోసం తెచ్చుకున్న మద్యాన్ని కొడుకు తాగేశాడని ఓ తండ్రి తన కన్న కొడుకును చంపేశాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం మహారాష్ట్రలోని అమరావతిలో ఈ సంఘటన జరిగింది. 65 ఏళ్ల హిరామన్ దుర్వే తన కోసం మద్యం కొని ఇంటికి తెచ్చుకున్నాడు. కానీ, ఆ మద్యాన్ని 35 ఏళ్ల కొడుకు దిలీప్ దుర్వే తన తండ్రికి తాగేశాడు. తన మద్యం అయిపోయిందని తెలుసుకున్న హిరామన్ కోపంతో దిలీప్ కు వాగ్వాదానికి దిగాడు. తరువాత హిరామన్ ఒక చెక్క కర్రను తీసుకొని దిలీప్ తలపై బలంగా కొట్టాడు. దీంతో దిలీప్‌ అక్కడికక్కడే మరణించాడు.

స్టేషన్ ఇన్‌చార్జ్ అర్జున్ తోసారే, సబ్-ఇన్‌స్పెక్టర్ దీపక్ దాల్వి నేతృత్వంలోని పోలీసు బృందం సంఘటన తర్వాత అక్కడికి చేరుకుని, బాధితుడి భార్య రాజకుమారి దుర్వే ఫిర్యాదు ఆధారంగా హత్య కేసు నమోదు చేసింది. మృతుడికి 5 ఏళ్లు, 2.5 ఏళ్ల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. దిలీప్ నిరుద్యోగి, మద్యానికి బానిసయ్యాడు. దీని వలన ఇంట్లో తరచుగా గొడవలు జరిగేవి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి