Fake MBBS Admission Racket: మెడికల్ సీట్ కావాలా.. ఇంకెందుకు ఆలస్యం.. అయితే మా వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.. మీ వివరాలు రిజిస్ట్రర్ చేసి మా కాల్ కోసం వేయిట్ చేయండి.. ఇలా చెప్పితే ఎవరు మాత్రం ఆగుతారు.. ఎవరైన బుట్టలో పడాల్సిందే.. ఈ విధంగానే చాల మంది విద్యార్థులు ఓ కేటుగాడి మాయలో పడ్డారు.. లక్షలకు, లక్షలు వాడికి సమర్పించాడు.. అంతా బాగనే ఉందని అనుకునేలోపు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది.. దీంతో అతగాడి కథ కాస్త కంచికి వెళ్లింది.
అతడో గోల్డ్‌మెడలిస్ట్..పేరు అర్వింద్ కూమార్ అలియాస్ ఆనంద్ కుమార్.. బెంగళూరు నివాసం ఉంటున్నాడు. ఓయూ నుంచి ఎంటెక్ గోల్డ్ మెడల్ పొందిన ఆనంద్ ఇండోర్ వెళ్లి కోచింగ్ సెంటర్లలో ఫ్యాకల్టీగా పనిచేశాడు. ఇక్కడి నుంచే అతడి దందా మొదలైంది. అక్కడ నీట్ పరీక్ష రాసిన అనేక మంది సీట్ల కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తారని గుర్తించాడు. అంతే ఇంకేముంది టర్గెట్ ఫిక్స్ చేశాడు.మెడికల్ సీట్లను ఎరగా వేసి దందాకు ప్లాన్ వేశాడు.
నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులను టార్గెట్ చేస్తూ దందా స్టార్ట్ చేశాడు. ఒక్కసారి వారిపై ఫోకస్ పెడితే చాలు వాళ్ల నుంచి డబ్బులు గుంజే వరకు వదలడు. దీనికోసం ఓ ఫేక్ వెబ్‌సైట్ కూడా క్రియేట్ చేశాడు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానంటూ వలలో వేసుకునేవాడు. వీరి కోసం భోపాల్, ఇండోర్, పుణే, బెంగళూరుల్లో కార్యాలయాలు తెరిచాడు. నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల జాబితాలను తెప్పించి. తన కార్యాలయాల్లో ఏర్పాటు చేసుకున్న కాల్ సెంటర్ల నుంచి ఫోన్లు చేయించి ఎస్‌ఎమ్‌ఎస్లు పంపి ఆకర్షించేవాడు.
రెండేళ్ల క్రితం ఓ నకిలీ వెబ్‌సైట్ రూపొందించాడు. దీనిలోకి ఎంటర్ అయిన వారి వివరాల ద్వారా అభ్యర్థుల ఫోన్లు చేయించి ప్రైవేట్ వైద్య కళాశాల్లో సీట్లంటూ చెప్పించే వాడు. స్టార్ హోటళ్లలో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో నమ్మకం కలిగించే వాడు. ఆపై విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు, అడ్వాన్సుల పేరుతో లక్ష వరకు వసూలు చేసి మోసం చేసేవాడు. ఇప్పటివరకు బానే సాగిన దందాలో ఒక్క ట్విస్ట్ వచ్చింది. భోపాల్ ఓ యువతి సీట ఇప్పిస్తానంటూ మోసం చేశాడని ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం అంతా బయటపడింది.
రంగంలోకి దిగిన భోపాల్ క్రైమ్ బ్రాంచ్ ఆనంద్‌ను పట్టుకున్నారు..పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లి విచారించగా. ఇతడి చేతిలో హైదరాబాద్‌కు చెందిన వాళ్లు మోసపోయారని గుర్తించారు. ఆయా విద్యార్థుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేయడంతో పాటు తదుపరి దర్యాప్తు కోసం భోపాల్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన స్పెషల్ టీమ్ రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి వెళ్లింది..వందల మందిని మోసం చేసిన ఈ స్కామ్ కోట్లలో ఉంటుందని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Viral video : దాహంతో ఉన్న పాముకు నీళ్లు తాగించాడు.. తర్వాత ఆ పాము ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..
ఖతార్‌లో సానియా మీర్జా జోడీకి చుక్కెదురు.. టాప్-200లోకి ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ టెన్నిస్ స్టార్
ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!