దుర్గగుడి వెండి సింహాల మాయం కేసును దాదాపు ఛేదించారు పోలీసులు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వాసిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుతోపాటు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో నంది విగ్రహం కేసునూ ఛేదించారు ఖాకీలు. ఇందులో తెలంగాకు చెందిన గుప్త నిధుల ముఠా హస్తం ఉన్నట్టు తేల్చారు.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ఊరేగింపు రథానికి ఉండే వెండి సింహాలు చోరీకి గురికావడం అప్పట్లో సంచలనమైంది. దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో టాక్‌ఫైట్ నడిచింది. మీరంటే మీరే దొంగలని ఒకరినొకరు దూషించుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు సాల్వ్ చేసినట్టు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గొల్లవాని తిప్ప వాసిని అదుపులోకి తీసుకున్నారు. జక్కంశెట్టి సాయిబాబాను అదుపులోకి తీసుకొని సీక్రేట్‌గా తమ స్టైల్‌లో విచారిస్తున్నారు. =
సాయిబాబు గతంలోనూ ఇలాంటి చోరీలకు పాల్పడినట్టు ఆధారాలు సేకరించారు పోలీసులు. ఓసారి అరెస్టు కూడా అయినట్టు మనకు సమాచారం అందుతోంది. భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు సహా ఇతర ప్రాంతాల్లోని ఆలయాల్లో ఇతను చోరీలకు పాల్పడ్డాడని నిర్ధరణకు వచ్చారు ఖాకీలు. 2012లో చివరిసారిగా పోలీసులకు చిక్కిన సాయిబాబా తర్వాత గాయబ్ అయ్యాడు. రహస్యప్రదేశంలో సాయిబాబాను విచారిస్తున్న ఖాకీలు… ఆయన నుంచి మరిన్ని వివరాలు లాగుతున్నారు. ఇందులో ఇతరల పాత్ర ఏమైనా ఉందా… ఇయన ఒక్కడే ఈ పని చేశాడా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇవాళ కానీ, రేపు కానీ సాయిబాబా అరెస్టును చూపించనున్నారు పోలీసులు.
మరోవైపు కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నంది విగ్రహ ధ్వంసం కేసు కూడా క్లైమాక్స్ వచ్చినట్టే ఉందంటున్నారు పోలీసులు. గుప్త నిధుల బ్యాచే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఆ దిశగానే లీడ్ దొరికిందంటున్నారు. జగ్గయ్యపేటలోని వత్సవాయి మండలం మక్కపేటలో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ నంది విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. గతేడాడి సెప్టెంబరు 16లో ఈ దుర్ఘటన జరిగింది. అప్పటి నుంచి నిందితుల వేట కొనసాగుతోంది. ఇన్నాళ్లకు ఈ కేసులో పురోగతి సాధించారు పోలీసులు.
పోలీసులకు ప్రస్తుతానికి దొరికిన ఆధారాలతో ఆరుగురి సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా తెలంగాణకు చెందిన గుప్త నిదుల బృందంలోని సభ్యులుగా అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు వారి నుంచి సేకరించి మీడియా ముందుకు రానున్నారు పోలీసులు.
Also Read:
గురువారం రూ. 50 లక్షల నగదు.. శుక్రవారం కేజీ బంగారం.. కంచికచర్ల పోలీసుల విసృత తనిఖీలు
Kurnool District: ఏడేళ్ల చిన్నారిని బలి తీసుకున్న నాటు వైద్యం.. పరారీలో వైద్యులు..ఏం జరిగిందంటే..?