స్వస్థలాలకు దిశ నిందితులు! మరికొద్దిసేపట్లో అంత్యక్రియలు

| Edited By:

Dec 23, 2019 | 5:40 PM

దిశ అత్యాచార నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం పూర్తి అయ్యింది. న్యూ ఢీల్లీలోని ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ విభాగాధిపతి సుధీర్‌గుప్తా నేతృత్వంలోని ముగ్గురు వైద్యుల బృందం.. డెడ్‌బాడీస్‌కి ఈ పోస్టుమార్టంను నిర్వహించింది. ఈ మొత్తం ప్రక్రియను అధికారులు వీడియో తీశారు. నాలుగు మృతదేహాలకు రీ పోస్టుమార్టం పూర్తి చేసేందుకు సుమారు 6 గంటలు సమయం పట్టింది. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. కాగా.. రీ పోస్టుమార్టం చేపట్టాక నిందితులు […]

స్వస్థలాలకు దిశ నిందితులు! మరికొద్దిసేపట్లో అంత్యక్రియలు
Follow us on

దిశ అత్యాచార నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం పూర్తి అయ్యింది. న్యూ ఢీల్లీలోని ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ విభాగాధిపతి సుధీర్‌గుప్తా నేతృత్వంలోని ముగ్గురు వైద్యుల బృందం.. డెడ్‌బాడీస్‌కి ఈ పోస్టుమార్టంను నిర్వహించింది. ఈ మొత్తం ప్రక్రియను అధికారులు వీడియో తీశారు. నాలుగు మృతదేహాలకు రీ పోస్టుమార్టం పూర్తి చేసేందుకు సుమారు 6 గంటలు సమయం పట్టింది. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.

కాగా.. రీ పోస్టుమార్టం చేపట్టాక నిందితులు మహ్మద్‌ ఆరీఫ్‌, జొల్లుశివ, జొల్లు నవీన్‌, చెన్నకేశవుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. సాయంత్రంలోపు అంత్యక్రియలు పూర్తిచేసేలా వారి తల్లిదండ్రులను పోలీసులు ఇప్పటికే ఒప్పించారు. ఇవాళ సాయంత్రం 5లోపు నివేదిక సమర్పించాల్సిందిగా ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో.. రీపోస్టుమార్టం వీడియో ప్రక్రియ సీడీ, పెన్‌డ్రైవ్‌ను కోర్టుకు సమర్పించనుంది ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్.

కుటుంబ సభ్యుల సమక్షంలోనే మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేశారు అధికారులు. కాగా.. ఏ1 నిందితుడు ఆరీఫ్ శరీరంలో 4 బుల్లెట్లు, ఏ2 శివ శరీరంలో 3 బుల్లెట్ గాయాలు, ఏ3 నవీన్ శరీరంలో 2 బుల్లెట్ గాయాలు, ఏ4 చెన్నకేశవులు శరీరంలో ఒక బుల్లెట్ గాయాన్ని అధికారులు గుర్తించారు.