Delhi Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 26 మంది మృతి.. పలువురికి గాయాలు..

Delhi Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిలో

Delhi Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 26 మంది మృతి.. పలువురికి గాయాలు..
Delhi Fire Accident

Updated on: May 13, 2022 | 11:51 PM

Delhi Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిలో కొద్దిమంది ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్టర్లు చెబుతున్నారు. పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని వాణిజ్య భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది భవనం నుంచి 60-70 మందిని రక్షించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వాస్తవానికి శుక్రవారం సాయంత్రం 4.45 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా చెబుతున్నారు. రాత్రి 10 గంటల వరకు ప్రజలు భవనంలోనే చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది.

నాలుగు అంతస్తులు ఉన్న ఈ భవనంలో చివరి ఫ్లోర్‌లో మంటలు చెలరేగినట్లు.. అనంతరం భవనం మొత్తం వ్యాపించినట్లు అధికారులు వివరించారు. ఇప్పటివరకు భవనంలో చిక్కుకుపోయిన దాదాపు 60-70 మందిని ప్రాణాలతో రక్షించారు. ఈ ఘటనలో దాదాపు 30 మందికిపైగా గాయాలు అయినట్లుగా గుర్తించారు. మంటలు చెలరేగిన సమయంలో కొంతమంది భవనంపై నుంచి దూకారు. ఇప్పటి మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 24 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని… మంటలను ఆర్పుతున్నాయి.

ఈ ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ స్పందించారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన తీరుని తెలుసుకున్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా స్పందించారు. సహాయకచర్యలపై అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

CM Jagan: సీఎం జగన్‌ దావోస్‌ పర్యటనకు లైన్‌ క్లియర్‌.. అనుమతినిచ్చిన సీబీఐ కోర్టు..

Keerthy Suresh: సిస్టర్ రోల్స్ చేయడం పై క్లారిటీ ఇచ్చిన కీర్తి.. ఆ కారణంతో ఒప్పుకుందట

Girls Missing Tirupati: ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయొద్దు.. అమ్మాయిలకు ఎస్పీ విజ్ఞప్తి..