ఒకే కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్య కలకలం !

కర్నాటక రాష్ట్రంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఏమంత పెద్ద కష్టం వచ్చిందో తెలియదో కానీ, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్నాటకలోని చామరాజనగర్‌ జిల్లాలో ఓ వ్యక్తి తన నలుగురు కుటుంబ సభ్యులను కాల్చిచంపి తాను కూడా కాల్చుకు చనిపోయాడు. ఆర్థిక నష్టాలు, అప్పుల భారమే ఈ కుటుంబాన్ని బలిగొన్నట్లు చామరాజనగర్‌ పోలీసులు భావిస్తున్నారు. మృతుడు ఓంకార్‌ ప్రసాద్‌ మృతదేహం వద్దే తుపాకి ఉండడంతో..అతడే తన తల్లిదండ్రులు నాగరాజ్‌ భట్టాచార్య, హేమలత, భార్య నికిత, […]

ఒకే కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్య కలకలం !

Updated on: Aug 16, 2019 | 1:54 PM

కర్నాటక రాష్ట్రంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఏమంత పెద్ద కష్టం వచ్చిందో తెలియదో కానీ, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్నాటకలోని చామరాజనగర్‌ జిల్లాలో ఓ వ్యక్తి తన నలుగురు కుటుంబ సభ్యులను కాల్చిచంపి తాను కూడా కాల్చుకు చనిపోయాడు. ఆర్థిక నష్టాలు, అప్పుల భారమే ఈ కుటుంబాన్ని బలిగొన్నట్లు చామరాజనగర్‌ పోలీసులు భావిస్తున్నారు. మృతుడు ఓంకార్‌ ప్రసాద్‌ మృతదేహం వద్దే తుపాకి ఉండడంతో..అతడే తన తల్లిదండ్రులు నాగరాజ్‌ భట్టాచార్య, హేమలత, భార్య నికిత, కుమారుడు ఆర్య కృష్ణలను కాల్చి చంపినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. కుటుంబ సభ్యులను కాల్చి చంపిన తర్వాత అతడు కూడా అదే గన్‌తో సూసైడ్‌ చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐదుగురి మరణం వెనక మిస్టరీని ఛేదించేందుకు ఇప్పటికే ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us