Girl Assaulted In Public In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ వ్యక్తి బాలికపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా.. బూటు, కర్రతో ఆమెను కొట్టాడు. ఈ ఘటన అక్కడున్న సీసీ టీవి కెమెరాలో రికార్డయింది. దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని.. ఢిల్లీ (Delhi) మహిళా కమిషన్ శుక్రవారం ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేసింది. ఈ ఘటన నగరంలోని పశ్చిమ విహార్‌లో జరిగింది. కాగా.. ఈ ఘటనపై రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA), కొంతమంది స్థానిక నివాసితులు కమీషన్‌ను ఆశ్రయించడంతో ఇది వెలుగులోకి వచ్చింది. కొట్టిన వ్యక్తి డ్రగ్ అడిక్ట్ అని.. బాలికను బందీగా ఉంచి హింసిస్తున్నాడని తెలిపారు. ప్రస్తుతం ఆ బాలిక ఆపదలో ఉందని వివరించారు. దీనికి (Girl Assaulted In Public) సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్‌కు అందించారు.
అనంతరం స్వాతి మలివాల్ ఈ వీడియోను ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. కొట్టిన వ్యక్తిని శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. దీంతోపాటు తీసుకున్న చర్యలపై 48గంటల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. బాలికను రక్షించిన అనంతరం ఆమెకు భద్రత కల్పించాలని కోరారు. మహిళ కమిషన్ ఆమెకు అన్ని విధాల సహాకారం ఇస్తుందని పేర్కొన్నారు. తన దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావడంపై వెల్ఫేర్ సభ్యులకు స్వాతి మలివాల్ ధన్యవాదాలు తెలిపారు.
వీడియో..
पश्चिम विहार की RWA से काफ़ी लोग मुझसे मिलने आए। उन्होंने मुझे ये विडीओ दिखायी कि कैसे लड़की को बेरहमी से एक आदमी मार रहा है। उनका कहना है ऐसा हर दूसरे दिन होता है। मैंने दिल्ली पुलिस को नोटिस इशू किया है। FIR दर्ज कर सख़्त से सख़्त कार्यवाही और लड़की की सुरक्षा होनी ही चाहिए! pic.twitter.com/rwYRi22iXj
— Swati Maliwal (@SwatiJaiHind) February 11, 2022
Also Read: