Cyber Crime: తక్కువ ధరకే వస్తువులు అంటూ నకిలీ వెబ్‌సైట్లు.. మీరూ కొనుగోలు చేశారా? వెంటనే పోలీసులను సంప్రదించండి.

|

Jul 28, 2021 | 1:17 PM

Cyber Crime: సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని రకాల పటిష్ట చర్యలు తీసుకుంటున్నా నేరగాళ్లు ఎప్పడో కొత్త పంథాతో ప్రజలను మోసం చేస్తున్నారు...

Cyber Crime: తక్కువ ధరకే వస్తువులు అంటూ నకిలీ వెబ్‌సైట్లు.. మీరూ కొనుగోలు చేశారా? వెంటనే పోలీసులను సంప్రదించండి.
Fake Websites
Follow us on

Cyber Crime: సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని రకాల పటిష్ట చర్యలు తీసుకుంటున్నా నేరగాళ్లు ఎప్పడో కొత్త పంథాతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇక ప్రజల ఆశనే పెట్టుబడిగా మార్చుకొని కొందరు నేరగాళ్లు యథేశ్చగా డబ్బులు కాజేస్తున్నారు. ఓఎల్‌ఎక్స్‌ నుంచి మార్టిమోనీ సైట్‌ల వరకు ఇలా ప్రతీ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ప్రజల జేబుల్లో నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ మోసమే ఇటీవల బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. ఫర్నిచర్‌తో పాటు కిరణా సామానులు ఇతర వెబ్‌సైట్‌ల కంటే అత్యంత తక్కువ ధరకు అంటూ కొన్ని ఫేక్‌ వెబ్‌సైట్లు దర్శనమిచ్చాయి. వీటిని చూసిన నెటిజన్లు తక్కువ ధరకు వస్తున్నాయని భారీగా కొనుగోలు చేశారు. కానీ డబ్బులు చెల్లించిన తర్వాత వస్తువలును డెలివరీ చేయలేదు. చివరికి తాము మోసాపోయామని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఈ కొత్త సైబర్‌ మోసం వెలుగులోకి వచ్చింది. zopnow, modway, deckup ఈ మోసపూరిత వెబ్‌సైట్‌ల జాబితాలో ఉన్నాయి. నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి ప్రజల నుంచి రూ. లక్షల్లో వసూళు చేసిన ఈ సైబర్‌ నేరగాళ్లను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా సైబరాబాద్‌ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘నకిలీ వెబ్‌సైట్లలో షాపింగ్‌ చేసి డబ్బులు కోల్పోయిన బాధితులు సైబర్‌ క్రైమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌, సైబరాబాద్‌లో పూర్తి వివరాలతో ఫిర్యాదుల చేయాలని కోరుతున్నాము’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

పోలీసులు చేసిన ట్వీట్‌..

Also Read:  Viral News: సమోసా ధర విషయంలో గొడవ.. ఓ వ్యక్తి బలవన్మరణానికి కారణమైన 5 రూపాయలు

Maoist Martyrs: నిశ్శబ్దంగా దండకారణ్యం.. ఏజెన్సీలో మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు

UP Accident: మృత్యువు రూపంలో దూసుకొచ్చిన ట్రక్కు.. ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం. 18 మంది మృతి