CRPF SI Suicide: ములుగు జిల్లాలో వాజేడు లో సీఆర్పీఎఫ్ ఎస్సై జెడ్ ఎల్ ఠాక్రే (56) ఉరేసుకుని గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. వాజేడు పోలీస్ స్టేషన్ క్యాంప్ లోని CRPF 39 బెటాలియన్ ‘C’- కంపెనీకి చెందిన ఎస్సై ఉదయం 9 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రత్యేక భద్రతా దళానికి చెందిన ఓ పోలీసు అధికారి బలవన్మరణానికి పాల్పడ్డారు. వాజేడు మండలం వాజేడు పోలీస్ స్టేషన్ పరిథిలో విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ 139సీ బెటాలియన్ ఎస్‌ఐ జెడ్ ఎల్ ఠాక్రే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆయన గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అది గమనించిన పోలీస్ సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు.
ఈయన స్వస్థలం మహారాష్ర్ట. 1986 బ్యాచ్‌కు చెందిన ఠాక్రే విధుల్లో చురుకుగా ఉండేవారని తోటి సిబ్బంది తెలిపారు. అయితే, వ్యక్తిగత కారణాల వలన క్యాంప్ లోని తన రూమ్ లో ఫ్యాన్ కి ఉరివేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాల కోసం విచారణ చేపట్టారు.
Read Also… Viral: పోలీసులకు షాక్ ఇచ్చిన కోతి.. కోర్టు ఆవరణలోని హత్యకు సంబంధించిన సాక్ష్యాలను ఎత్తుకెళ్లిన వైనం