కాకినాడలో కార్పొరేటర్ దారుణ హత్య.. అర్థరాత్రి కారుతో ఢీకొట్టి హతమార్చిన దుండగులు

|

Feb 12, 2021 | 8:01 AM

కాకినాడ రెండో వార్డు కార్పొరేటర్ కంపర రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. ఆర్డీవో కార్యాలయం రోడ్ కారు షెడ్డు సమీపంలో కారుతో ఢీకొట్టి చంపేసినట్లు పోలీసులు తెలిపారు.

కాకినాడలో కార్పొరేటర్ దారుణ హత్య.. అర్థరాత్రి కారుతో ఢీకొట్టి హతమార్చిన దుండగులు
Follow us on

Murder In Kakinada : తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. కాకినాడ రెండో వార్డు కార్పొరేటర్ కంపర రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేటర్ రమేష్.. సొంత పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అర్థరాత్రి రెండుగంటల సమయంలో కారుతో ఢీకొట్టి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆర్డీవో కార్యాలయం రోడ్ కారు షెడ్డు సమీపంలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్నారు. తీవ్ర రక్తమడుగులో పడి ఉన్న రమేష్‌ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మ‌ృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ దారుణానికి పాత కక్షలే కారణమని అనుమానిస్తున్నారు.

Read Also…  చిత్తూరు జిల్లాలో విషాదం.. ఎంజేఆర్ కళాశాల అధినేత రైలు కింద పడి ఆత్మహత్య..!