Couple Suide: కూతురు పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు.. ఇంతలోనే తల్లిదండ్రులకు షాక్.. బలవన్మరణానికి పాల్పడ్డ కానిస్టేబుల్ దంపతులు

|

Apr 21, 2021 | 7:02 AM

కొందరు పరవు కోసం కన్నబిడ్డలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలు తీస్తే.. మరికొందరు అదే పరువు కోసం బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

Couple Suide: కూతురు పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు.. ఇంతలోనే తల్లిదండ్రులకు షాక్.. బలవన్మరణానికి పాల్పడ్డ కానిస్టేబుల్ దంపతులు
suicide
Follow us on

కొందరు పరవు కోసం కన్నబిడ్డలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలు తీస్తే.. మరికొందరు అదే పరువు కోసం బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రజా రక్షకుడిగా ఉండాల్సిన ఓ పోలీసు కానిస్టేబుల్ కుటుంబం పరువు కోసం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

కూతురు తనకు తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేదని వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. దీంతో అవమాన భారం తట్టుకోలేక తల్లిదండ్రులు తనువు చాలించారు. సంగారెడ్డి జిల్లా కంది గ్రామానికి చెందిన నారాయణ(45) పోలీసు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు నిహారికకు ఈ మధ్యనే పెళ్లి నిశ్చయం అయింది. కానీ, ఆమెకు ఈ వివాహం ఇష్టం లేదు. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేదు. ఈ వివాహం ఇష్టంలేని సదరు యువతి రెండు రోజుల కిందట మరో వ్యక్తితో వెళ్లిపోయింది. ఎంతో అపురూపంగా పెంచుకున్న కూతురు చేసిన పనికి కానిస్టేబుల్ దంపతులు మనస్తాపానికి గురయ్యారు. భయటకు చెబితే పరువు పోతుందని ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం శివారులోని కైలాష్‌ గార్డెన్‌ ఆవరణలో చోటుచేసుకుంది.

అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌ గ్రామానికి చెందిన పల్లకొండ నారాయణ(45), ఆయన భార్య రాజేశ్వరి(40) కొన్నాళ్లుగా కందిలో నివాసం ఉంటున్నారు. 1995కు బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌ నారాయణ గతంలో సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించాడు. ప్రస్తుతం జిన్నారం మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు నిహారికకు పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో వేరు వ్యక్తితో వెళ్లి పోయింది. ఈ విషయం తెలుసుకున్న నారాయణ తన విధులకు సెలవు పెట్టి ఇంటికొచ్చారు. తన కూతురు ఇలాంటి నిర్ణయం తీసుకుంటుదని తట్టుకోలేక భార్యాభర్తలిద్దరు తీవ్రంగా కుమిలిపోయారు. పెళ్లి కుదిరిన తర్వాత కూడా తన కూతురు ఎక్కడికో వెళ్లిపోయిందని.. ఈ విషయం బంధులవులకు తెలిస్తే పరువు పోతుందని ఆ దంపతులు తీవ్రంగా మదనపడ్డారు. తీవ్రంగా మనోవేదనకు గురై ఆ దంపతులు క్షణికావేశంలో ఒకే తాడుతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న అదనపు ఎస్పీ సృజన, డీఎస్పీ బాలాజీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

Read Also…  Bus Accident: వలస కూలీలతో వెళుతున్న బస్సు బోల్తా… ముగ్గురు మృతి, పలువురికి గాయాలు.. 8 మంది పరిస్థితి విషమం