హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు కురిశాయి.. అనేక కాలనీలు, బస్తీలు నీటమునిగాయి. రోడ్లన్నీ జలమయమై చెరువులను తలపించాయి. వరదనీరు ఇళ్లను ముంచెత్తింది. అయితే, వరద వస్తే ఎలా ఉంటుంది..? నిమిషాల వ్యవధిలోనే ఇళ్లు, వీధులు ఎలా మునిగిపోయాయ్..? జనం ఎలా పరుగులు తీశారు..? ఇలాంటి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. పాతబస్తీలోని ఓ ఇంటి సీసీ టీవీ ఫుటేజీలో రికార్డైన వరద దృశ్యాలు..
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ పాతబస్తీ బాబానగర్ అతలాకుతలమైంది. సమీపంలో ఉండే గుర్రం చెరువు తెగిపోవడంతో…పలుకాలనీలను వరద ముంచెత్తింది. అనేక ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. పాతబస్తీలో అనేక చోట్ల ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. క్షణాల్లో వరద నీటిని ఎలా ముంచేసిందో చూస్తే..ఏ స్థాయిలో వాన విరుచుకుపడిందో అర్థం అవుతుంది.