Breaking: వరంగల్‌లో ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు గల్లంతు

parvathagiri, warangal district: వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక శివారులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ కారు ఎస్సారెస్పీ కెనాల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు..

Breaking: వరంగల్‌లో ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు గల్లంతు

Updated on: Feb 10, 2021 | 11:32 AM

parvathagiri, warangal district: వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక శివారులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ కారు ఎస్సారెస్పీ కెనాల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఓ వ్యక్తి మృతి చెందగా.. అతను ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పేర్కొంటున్నారు. గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలను చేపట్టారు. కారును కెనాల్‌ నుంచి బయటకు తీశారు. గల్లంతైన ముగ్గురి కోసం స్థానికుల సహాయంతో పోలీసులు గాలిస్తున్నారు. వరంగల్‌ నుంచి తొర్రూర్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

ఆ సీట్లో నేను కూర్చోలేదు… తనపై ఆరోపణలను ఖండించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా