కర్నూలు జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం, ఏకంగా ఒక ఏరియానే టార్గెట్ చేసిన కంత్రీలు !

కర్నూలు జిల్లాలో దోపిడీ దొంగలు హల్‌చల్‌ చేశారు. ఒక ఏరియాని టార్గెట్‌గా చేసుకోని వరుస చోరీలకు పాల్పడ్డారు. కేవలం ఒక్క ప్రాంతంలోనే వరుసగా ఐదు ఇళ్లు...

కర్నూలు జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం, ఏకంగా ఒక ఏరియానే టార్గెట్ చేసిన కంత్రీలు !
Ram Naramaneni

|

Dec 05, 2020 | 2:41 PM

కర్నూలు జిల్లాలో దోపిడీ దొంగలు హల్‌చల్‌ చేశారు. ఒక ఏరియాని టార్గెట్‌గా చేసుకోని వరుస చోరీలకు పాల్పడ్డారు. కేవలం ఒక్క ప్రాంతంలోనే వరుసగా ఐదు ఇళ్లు, ఓ చర్చీలో లూటీకి తెగబడ్డారు దుండగులు. వివరాల్లోకి వెళ్తే..నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా మండంలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తెలుగు బాప్టిస్ట్‌ చర్చీలో దేవుడికి భక్తులు సమర్పించే కానుకల కోసం ఏర్పాటు చేసిన డబ్బాను పగలగొట్టి 2 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. దీంతో చర్చ్‌ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నందికొట్కూరు మారుతినగర్‌లోనూ దొంగలు చేతివాటం ప్రదర్శించారు. వరుసగా ఐదు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. 70 వేల నగదు, 3 తులాల బంగారం, కలర్ టీవీ ఎత్తుకెళ్లినట్లుగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వరుస చోరీలను ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు క్లూస్‌టీం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ప్రజలకు భరోసానిచ్చారు.

Also Read :

Concussion Substitute : కంకషన్​ సబ్​స్టిట్యూట్​ అంటే ఏంటి? దాని కోసం రూపొందించిన నియమాలు ఏంటి?

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇంట తీవ్ర విషాదం, ఎంపీకి ప్రముఖుల పరామర్శ

తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం, ఒకే మూవీలో పవర్ స్టార్, సూపర్ స్టార్, ఫ్యాన్స్‌కు పూనకాలే !

కోళ్లు, మేకలు, చేపలను చంపకుండానే మాంసం..అదే టేస్ట్, అదే స్మెల్..సింగపూర్‌లో నయా మీట్ !

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu