పెళ్లి అనేది జీవితంలో ఎంతో మధురమైనది. ఆ మధుర క్షణాలను ఆస్వాదించకముందే నవ వధువు కానరాని లోకాలకు వెళ్లిపోయింది. వారి కుటుంబసభ్యులను తీరని వేదనను మిగిల్చింది. తాను మరణించినా తన అవయవాలను దానం చేసి జీవన్మృతురాలిగా నిలిచింది కర్ణాటకలోని కొడచెరువు గ్రామానికి చెందిన యువతి. మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అందరూ ఆనందంగా నిశ్చితార్థం వేడుకలో ఉండగా చైత్ర ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఐదు రోజుల చికిత్స అనంతరం ఆమె జీవన్మృతురాలిగా మారింది. ఆమె అవయవాలను దానం చేసిన కుటుంబ సభ్యులు మరికొందరికి జీవదానం చేశారు.
కర్ణాటక(karnataka) లోని కోలారు జిల్లా శ్రీనివాసపుర తాలూకా… కొడచెరువు గ్రామానికి చెందిన చైత్రకు హొసకోటెకు చెందిన యువకునితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల ఏడో తేదీన వివాహం చేయాలని ఇరువురి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆరో తేదీన నిశ్చితార్థం నిర్వహించారు. నిశ్చితార్థ వేడుకలో బంధువులు, మిత్రులతో కలిసి వేదికపై ఫొటోలు తీసుకుంటున్న సమయంలో చైత్ర ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు గమనించి, తక్షణమే చైత్రను బెంగళూరులోని నిమ్హాన్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. వైద్య చికిత్స అందిస్తుండగా చైత్ర బ్రెయిన్ డెడ్ కు గురైనట్లు వైద్యులు నిర్ధరించారు. ఆమె జీవించడం కష్టమని కుటుంబసభ్యులకు తెలిపారు. చైత్ర అవయవదానం చేయాలని, కుటుంబ సభ్యులను ఒప్పించారు. డాక్టర్ల కౌన్సెలింగ్ తో అవయవదానానికి చైత్ర కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. అవయవదానం ప్రక్రియ పూర్తయిన అనంతరం కొడచెరువులో చైత్ర భౌతికకాయానికి అంత్యక్రియలు చేశారు.
Also Read
Warangal crime: జైలుకెళ్లినా మారని తీరు.. మరోసారి ఆ పని చేస్తుండగా..
Watch Video: రైలు పట్టాలపై పడిన బాలికను రక్షించిన యువకుడు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు