Boy Missing: ఈ మధ్య కాలంలో పిల్లల అదృశ్యం కలకలం రేపుతోంది. డబ్బు కోసం దుండగులు పిల్లలను అరెస్టు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఏకంగా హతమారుస్తున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. పిల్లలు కిడ్నాప్ అయ్యారంటే బతికి వస్తారా ..? లేదా అన్న అనుమానాలు కలిగించేలా ఉన్నాయి. తాజాగా కామారెడ్డిలోని దేవునిపల్లిలో నిశాంత్ అదృశ్యం కలకలం రేపుతోంది. నిన్న ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు.. తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీపుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలుడు అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
Also Read: Laptops Theft: గర్ల్‌ఫ్రెండ్‌కు అవమానం జరిగిందనే కోపంతో 500 ల్యాప్‌టాప్‌లను దొంగిలించిన యువకుడు