Veeravaram Murder : తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో చికెన్ పకోడి వివాదం ఓ బాలుడి ప్రాణాలు తీసింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి ఇనుప రాడ్‌తో తలపై కొట్టడంతో పదో తరగతి చదివే విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గ్రామానికి చెందిన శింగం ఏసు పకోడి బండి నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి పదో తరగతి చదివే కుమారుడు ఉన్నాడు. తండ్రిక సాయంగా బండి వద్ద సాయం చేస్తూ ఉంటాడు. అయితే గత రాత్రి బండి దగ్గర కొవ్వూరి వీరబాబుతో వివాదం జరిగింది. మద్యం తాగి ఉన్న వీరబాబు తన స్కార్పియోతో పకోడీ బండిని ఢీకొట్టాడు. బండి వద్ద ఉన్న తండ్రి ఏసు, కుమారుడు శివకు తీవ్రగాయాలయ్యాయి.
ఆ తర్వాత బాలుడు శివ తలపై వీరబాబు ఇనుప రాడ్‌తో కొట్టాడు. స్థానికులు గమనించి శివను కాకినాడ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అర్ధరాత్రి సమయంలో మృతి చెందాడు. నిందితుడు వీరబాబు పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. బాలుడు మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీరవరంలో పోలీసులు భారీగా మోహరించారు. Dsp అరిటాకుల శ్రీనివాస్ స్థానిక పోలీసులు క్లూస్ టీం లతో ఘటన స్థలాన్ని పరిశీలించారు.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు.