
వెస్ట్ బెంగాల్‌లో మరో బీజేపీ కార్యకర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా రాంనగర్ ప్రాంతంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. రాంనగర్ బీజేపీ బూత్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న పూర్ణచంద్ర దాస్ అతని ఇంటి సమీపంలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన వయస్సు 44 ఏళ్లు. అధికార పార్టీ టీఎంసీకి చెందిన
కొందరు కార్యకర్తలు గత కొద్ది రోజులుగా పూర్ణచంద్రదాస్‌ను పార్టీలో చేరాలంటూ ఒత్తిడి తెచ్చారని.. ఈ క్రమంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడని బీజేపీ నేతలు ఆరోపించారు. టీఎంసీలో చేరేందుకు ఆయన సిద్ధంగా లేరని.. టీఎంసీ కార్యకర్తల ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడంటూ అటు మృతుడి బంధువులు కూడా ఆరోపిస్తున్నారు.
కాగా, బీజేపీ ఆరోపణలను టీఎంసీ కొట్టిపారేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇటీవల సీనియర్ బీజేపీ నేత కూడా ఇలానే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Read More
భవనంలో భారీ పేలుడు.. 16 మందికి గాయాలు