హైదరాబాద్‌లో బైక్‌ల దొంగ అరెస్ట్.. చోరీలు ఎందుకు చేస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..

నగరంలో గంజాయి మత్తుకు బానిసైన యువత పెడదోవపడుతున్నారు. కష్టం చేయడం చేతకాకా గంజాయికి డబ్బులేక అరాచకాలకు దిగుతున్నారు.

హైదరాబాద్‌లో బైక్‌ల దొంగ అరెస్ట్.. చోరీలు ఎందుకు చేస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..

Updated on: Dec 09, 2020 | 5:58 AM

నగరంలో గంజాయి మత్తుకు బానిసైన యువత పెడదోవపడుతున్నారు. కష్టం చేయడం చేతకాకా గంజాయికి డబ్బులేక అరాచకాలకు దిగుతున్నారు. ఈసీ మనీ కోసం చోరీలకు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. తాజాగా నగరంలో బైక్‌లు దొంగతనం చేస్తున్న ఓ యువకుడిని వెస్ట్‌జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లికి వెళితే..

మొహమ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మమ్ము అనే యువకుడు టోలిచౌకీలో నివాసముంటున్నాడు. నానాల్‌నగర్‌లో టీ స్టాల్‌లో పనిచేస్తున్నాడు. ఖాన్‌ గంజాయికి బానిసయ్యాడు. డబ్బుల కోసం క్రమంగా దొంగతనం చేయడం ప్రారంభించాడు. బహిరంగ ప్రదేశాల్లో పార్క్‌ చేసిన బైక్స్‌ను దొంగిలించి అమ్మేయడం వృత్తిగా పెట్టుకున్నాడు. గడిచిన మూడు వారాల్లో లంగర్‌హౌజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు బజాజ్‌ పల్సర్‌ బైక్‌లను దొంగిలించాడు. సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల రికార్డు ఆధారంగా పోలీసులు నిందితుడి గుర్తించారు. విచారణలో గంజాయి కోసం తానే బైక్‌లను దొంగిలించినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడి వద్ద నుంచి రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.