Andhra Pradesh: ఏడాదిన్నర బిడ్డ పక్కనుండగానే బీహార్ మహిళపై దాడి, అత్యాచారం.. తెల్లారేసరికి మృత్యు ఒడిలోకి

|

Jan 24, 2022 | 4:53 PM

ఎన్ని బాధలు ఉన్నాయో తెలియదు.. ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు. ఎక్కడికి వెళ్లాలనుకుందో సమాచారం లేదు.  బీహార్ కు చెందిన ఓ మహిళ తన ఏడాదిన్నర వయసున్న బిడ్డతో డోన్ రైల్వేస్టేషన్ లో దిగింది.

Andhra Pradesh: ఏడాదిన్నర బిడ్డ పక్కనుండగానే బీహార్ మహిళపై దాడి, అత్యాచారం.. తెల్లారేసరికి మృత్యు ఒడిలోకి
Representative Picture
Follow us on

మన ఏపీ(Andhra Pradesh)లో జరిగిన ఘోరం ఇది. కామాంధుల కబంధ హస్తాల్లో చిక్కుకుని ఓ బీహార్(Bihar) మహిళ బలయ్యింది. అత్యాచారం చేసి.. ఆమెను దారుణంగా హింసించారు. ప్రతిఘటించడంతో చావబాదారు. ఎముకలు కొరకే చలిలో.. భరించలేని బాధతో.. తన బిడ్డ ఏమయిపోతాడో ఆవేదనతో.. రాత్రంతా విలవిల్లాడిన ఆ తల్లి తెల్లారేసరికి మృత్యు ఒడిలోకి జారుకుంది. ఈ పాడు ప్రపంచంలో బ్రతకలేక.. శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయింది. ఎంత అమానుషం ఇది. నిర్భయ, దిశ  ఘటనల కంటే ఏ మాత్రం తీవ్రత తక్కువ. చంటి పిల్లోడు పక్కనే ఉన్నా ఆ మృగాళ్ల మనసులో జాలి కలగలేదంటే.. వారిని మనుషులని అనొచ్చా..?. ఆ పసివాడి ఏడుపు వింటే రాళ్లైనా కరుగుతాయే.. కానీ ఆ కఠినాత్ములు మాత్రం అవేవి ఆలోచించలేదు. జంతువుల్లా మీదపడి వాంఛ తీర్చుకున్నారు. కర్నూలు జిల్లా(Kurnool district) డోన్  రైల్వేస్టేషన్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

ఎన్ని బాధలు ఉన్నాయో తెలియదు.. ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు. ఎక్కడికి వెళ్లాలనుకుందో సమాచారం లేదు.  బీహార్ కు చెందిన ఓ మహిళ తన ఏడాదిన్నర వయసున్న బిడ్డతో డోన్ రైల్వేస్టేషన్ లో దిగింది. ఎక్కడికి పోవాలో తెలియక అక్కడే ఒంటరిగా ఉంది. ఇదే అదునుగా భావించిన మృగాళ్లు ఆమెను పక్కకు లాక్కెళ్లి పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక ఆమె ఈ ఉదయం మృతిచెందింది. సూర్యుడు ఉదయించేసరికి ఎవరూ తెలియని డోన్ రైల్వే స్టేషన్ లో అనాథ శవంలా మిగిలిపోయింది ఆ మహిళ. బాలుడిని శిశు సంరక్షణ కేంద్రంకి తరలించారు పోలీసులు. నిందితుల కోసం వేట షురూ చేశారు. ప్రత్యక్ష సాక్షి సమాచారం మేరకు ఇద్దరు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

(విజువల్స్ మీ మనసును కలచివేసే అవకాశం ఉంది. అందుకే అందుబాటులో ఉంచలేదు)

Also Read:  ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన మోటివేషనల్ స్పీకర్ ఆత్మహత్య.. ఎందుకంటే

ఇంటి ముందు గేట్లు ఎత్తుకెళ్లిన దొంగలు.. కానీ ఊహించని విధంగా