Bihar Court Rejects Case Filed Against Salman : యువ హీరో సుశాంత్ సూసైడ్ కు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్దలపై వరుస కథనాలు ప్రాచూర్యంలోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వారిపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. నెపోటిజం వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ సినిమా ప్రపంచం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది.
అయితే బీహార్ కు చెందిన ఓ అడ్వకేట్ కొందరు బాలీవుడ్ ప్రముఖలపై కేసు కూడా పెట్టాడు. సుధీర్ కుమార్ ఓజా అనే అడ్వకేట్ ఏకంగా బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్ ఖాన్, ఏక్తా కపూర్, సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహార్ తోపాటు మరికొందరిపై కేసు కూడా నమోదు చేశాడు.
అడ్వకేట్ సుధీర్ కుమార్ ఓజా వాదనలను విన్న చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముఖేష్ కుమార్ తోసిపుచ్చారు. ఈ విషయం కోర్టు పరిధికి వెలుపల ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై స్పందించిన సుధీర్ దీనిని జిల్లా కోర్టు ముందు సవాలు చేస్తాను అని పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో బీహార్ ప్రజలు బాధలో ఉన్నారు. మంచి వ్యక్తికి న్యాయం జరగాలని వారు కోరుతున్నారు. ఇందుకోసం నేను కృషి చేస్తా అని స్పష్టం చేశారు