టిక్ టాక్ ఎఫెక్ట్..దూకుడు విలన్ అరెస్ట్

|

Jul 19, 2019 | 1:12 PM

టిక్..టాక్ ఎవ్వర్ని వదిలిపెట్టదు..యూజ్ చేసేవాళ్లందరి  సరదా తీర్చేశాలా ఉంది. ఇప్పటికే ఈ యాప్ వల్ల కలుగుతోన్న అనర్థాల నేపథ్యంలో పలు దేశాలు..ఇండియాలోని కొన్ని రాష్ట్రాలు బ్యాన్ విధించాయి. ఇప్పటివరకు సాధారణ ప్రజల జీవితాల్లో సెగలు రేపిన టిక్ టాక్..ఇప్పుడు సెలబ్రిటీలను వదలడం లేదు. తాజాగా హిందీ బిగ్ బాస్ ఫేమ్, నటుడు అజాజ్ ఖాన్  టిక్ టాక్ వల్ల బలయ్యాడు. అతడు పోస్ట్ చేసిన టిక్ టాక్ వీడియో జాతి హింస లేదా ఇరువర్గాల మధ్య ఘర్షనలు […]

టిక్ టాక్ ఎఫెక్ట్..దూకుడు విలన్ అరెస్ట్
Follow us on

టిక్..టాక్ ఎవ్వర్ని వదిలిపెట్టదు..యూజ్ చేసేవాళ్లందరి  సరదా తీర్చేశాలా ఉంది. ఇప్పటికే ఈ యాప్ వల్ల కలుగుతోన్న అనర్థాల నేపథ్యంలో పలు దేశాలు..ఇండియాలోని కొన్ని రాష్ట్రాలు బ్యాన్ విధించాయి. ఇప్పటివరకు సాధారణ ప్రజల జీవితాల్లో సెగలు రేపిన టిక్ టాక్..ఇప్పుడు సెలబ్రిటీలను వదలడం లేదు. తాజాగా హిందీ బిగ్ బాస్ ఫేమ్, నటుడు అజాజ్ ఖాన్  టిక్ టాక్ వల్ల బలయ్యాడు.

అతడు పోస్ట్ చేసిన టిక్ టాక్ వీడియో జాతి హింస లేదా ఇరువర్గాల మధ్య ఘర్షనలు రేపే విధంగా ఉందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే  అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్ 153A, సెక్షన్ 67 కింద కేసులు నమోదు చేశారు. అజాజ్ ఖాన్ `బిగ్ బాస్-హిందీ` సెలబ్రిటీగా అందరికి సుపరిచితుడే. విజయవంతమైన పలు తెలుగు సినిమాల్లో కూడా విలన్ పాత్రలు పోశాడు. దూకుడు-నాయక్-టెంపర్- రోగ్-రక్త చరిత్ర వంటి చిత్రాల్లో అతడు విలన్‌గా నటించాడు. ఒకే ఒక్క వివాదాస్పద టిక్ టాక్ వీడియో అతడిని కటకటాల పాలు చేసింది. సో బీ కేర్ ఫుల్ విత్ టిక్ టాక్.