Crime News: చిన్నారులపై అఘాయిత్యం.. సిగిరేట్లు తాగాలంటూ చెట్టుకు కట్టేసి కొట్టారు.. చివరకు..

|

Oct 26, 2021 | 8:38 PM

Bengaluru School Kids Tied To Tree: చిన్నారులపై కొందరు యువకులు అమానుషంగా ప్రవర్తించారు. సిగరెట్‌ తాగాలంటూ వారిని చితక్కొట్టారు. అంతటితో ఆగకుండా

Crime News: చిన్నారులపై అఘాయిత్యం.. సిగిరేట్లు తాగాలంటూ చెట్టుకు కట్టేసి కొట్టారు.. చివరకు..
Crime News
Follow us on

Bengaluru School Kids Tied To Tree: చిన్నారులపై కొందరు యువకులు అమానుషంగా ప్రవర్తించారు. సిగరెట్‌ తాగాలంటూ వారిని చితక్కొట్టారు. అంతటితో ఆగకుండా పాఠశాల ఆవరణలోనే వారిని చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ఇది గమనించిన కొందరు మొబైల్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ఆధ్వర్యంలో నడుపుతున్న ప్రభుత్వ పాఠశాలలో చాలామంది చిన్నారులు చదువుకుంటున్నారు. అయితే.. ఇటీవల కాలంలో 10-13 సంవత్సరాల మధ్య వయస్సు గల కొంతమంది విద్యార్థులను క్యాంపస్‌లో ప్రవేశించిన ఆరుగురు ఆకతాయిల ముఠా బెదిరింపులకు గురిచేస్తూ తరచూ వేధిస్తోంది.

చిన్న పిల్లలు అని చూడకుండా సిగరెట్‌ తాగాలని వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థులను చెట్టుకు కట్టేసి విచాక్షణారహితంగా కొట్టారు. నిందితులంతా సమీపంలోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారు పాఠశాలకు సమీపంలోని గ్రామానికి చెందిన వారు కావడంతో అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిందితులు పలుమార్లు ఉపాధ్యాయులను కూడా బెదిరించారని స్థానికులు వెల్లడించారు. ఈ క్రమంలో కొంత మంది స్థానికులు.. పిల్లలను చెట్టుకు కట్టేసి కొడుతున్న వీడియోను స్థానిక కార్పోరేటర్‌కు పంపించారు. దీంతోపాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ చేశారు.

దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వారిలో ఐదుగురు మైనర్‌లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అనంతరం నిందితుల్లో ఒకడిని జ్యూడిషియల్ కస్టడికి తరలించగా.. మరో ఐదుగురిని జువైనల్ హోమ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై డీసీపీ దేవరాజ్‌ మాట్లాడుతూ.. గ్రామంలో, పాఠశాల పరిసరాలలో అసాంఘిక చర్యలు జరగకుండా పెట్రోలింగ్‌ను పెంచుతామని తెలిపారు. కాగా.. ఈ ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు పోలీసులను కోరారు.

Also Read:

Crime News: వీడు మామూలోడు కాదు.. 37 కోట్ల బీమా డబ్బుల కోసం పాముతో వేరే వ్యక్తిని చంపాడు.. చివరకు

Rajasthan: ప్రేమను అంగీకరించలేదని మహిళను నరికి చంపాడు.. ఆపై ఆమె మృతదేహాన్ని కౌగిలించుకున్నాడు..