Alert Wi-Fi: పబ్లిక్ Wi-Fi వాడుతున్నారా..? వాడుకుని బ్యాకింగ్ ట్రాన్సక్షన్స్ చేస్తున్నారా? అయితే బీ అలర్ట్..!

|

Apr 08, 2021 | 6:36 PM

పబ్లిక్ Wi-Fi వాడుతున్నారా..? పబ్లిక్ WIFIతో మీరు బ్యాంక్ ట్రాంజక్షన్స్ చేస్తున్నారా..? అయితే మీరు డెంజర్ జోన్‌లో ఉన్నట్లే..! మీ పూర్తి వివరాలు ఇప్పటికే కొందరు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లి ఉండే ఛాన్స్ ఉంది. మీరు అమర్చితే మీ బ్యాంక్ అకౌంట్లు నిల్ కావడం మాత్రం నిజం...

Alert Wi-Fi: పబ్లిక్ Wi-Fi వాడుతున్నారా..? వాడుకుని బ్యాకింగ్ ట్రాన్సక్షన్స్ చేస్తున్నారా? అయితే బీ అలర్ట్..!
Banking Online With Public
Follow us on

పబ్లిక్ Wi-Fi వాడుతున్నారా..? పబ్లిక్ WIFIతో మీరు బ్యాంక్ ట్రాన్సక్షన్స్ చేస్తున్నారా..? అయితే మీరు డెంజర్ జోన్‌లో ఉన్నట్లే..! మీ పూర్తి వివరాలు ఇప్పటికే కొందరు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లి ఉండే ఛాన్స్ ఉంది. మీరు అమర్చితే మీ బ్యాంక్ అకౌంట్లు నిల్ కావడం మాత్రం నిజం. అయితే మీ బ్యాంకు అకౌంట్లలో బ్యాలెన్స్ ఎంత ఉందో జాగ్రత్తగా చూసుకోండి… ఎందుకంటారా.. అయితే చదవండి.. ఈ స్టోరీ కోసమే…

వైఫై కనెక్షన్ ద్వారా ఈజీగా డేటా షేర్ చేసుకోవచ్చు. మొబైల్ డివైజ్‌తోపాటు డెస్క్‌టాప్ ఇలా ఏ డివైజ్ నుంచి అయినా ఈజీగా ఇంటర్నెట్ షేర్ చేసుకోవచ్చు. ఈ ఈజీ టు షేర్ ఇప్పుడు యూజర్ల కొంప ముంచేస్తోంది. ఫ్రీగా వస్తోంది కదా అని వైఫైతో అన్ని చూసేస్తున్నారు… చేసేస్తున్నారు.. ఇంకేముందు ఇలా ఫ్రీగా దొరికితే ఎవరైనా వదిలిపెడతారా? దొరికిందిలే కదా ఛాన్స్ అంటూ సినిమాలు, వీడియోలు తెగ డౌన్ లోడ్ చేయడమే కాదు అక్కడే అడ్డ బిటాయిస్తున్నారు కొందరు. పబ్లిక్ వైఫై నెట్ వర్క్ వాడే సమయంలో మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా? లేదంటే.. మీకు తెలియకుండానే మీ వ్యక్తిగత వివరాలు మోసగాళ్ల చేతిల్లోకి వెళ్లిపోతారు అంటే తాజాగా నెటిజన్లను సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. “పబ్లిక్ WIFI వాడేటప్పుడు ఎటువంటి ఆర్దిక లావాదేవీలు చేయవద్దు… “అంటూ ఓ ట్వీట్ చేశారు.

అందుకంటే మీకు మేము పూర్తి వివరాలను అందిస్తాము… బ్యాంకు అకౌంట్ల వివరాలను దొంగిలించి డబ్బులు కాజేస్తారు. కానీ, ఇక్కడే మీరు ఆలోచించాల్సి విషయం ఒకటే.. పబ్లిక్ వైఫై నెట్ వర్క్ వాడొద్దు అనేది ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి. సాధారణ చాల మంది బ్రౌజింగ్ కోసం వాడుతుంటారు అలా కొంత వరకు పర్వాలేదు.. కానీ, పబ్లిక్ వైఫై కనెక్ట్ అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంకు అకౌంట్లలో లాగిన్ కావొద్దు అని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ బ్యాంకు అకౌంట్ వివరాలు వైఫై ప్రొవైడ్ చేసేవారికి ఈజీగా షేర్ అవుతుంటాయి. వెబ్ ఇంటర్ ఫేస్ నుంచి సులభంగా సెర్చ్ చేసినవారి వివరాలు వారికి తెలిసిపోతాయి. అనుమానాస్పద వెబ్ సైట్లను ఓపెన్ చేయకపోవడమే చాలా మట్టుకు మంచిదని ఇప్పటికే చాలా సార్లు తెలంగాణ సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.

ఆయా వెబ్ సైట్లోకి వెళ్లి లింకులు క్లిక్ చేయడం ద్వారా మాల్ వేర్ మీ డివైజ్ ల్లోకి చేరి మీ పర్సనల్ డేటాను క్యాప్చర్ చేసే ముప్పు పొంచి ఉంటుంది. ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లకు పబ్లిక్ వై-ఫై వినియోగంపై ఎప్పటికప్పుడూ అలర్ట్ చేస్తోంది. పబ్లిక్ వైఫై సర్వీసుతో బ్యాంకు అకౌంట్లను లాగిన్ కావొద్దని గట్టిగా హెచ్చరిస్తోంది. ఇలా ఉపయోగించుకోవడం వల్ల మీ బ్యాంక్ వివరాలు వారికి తెలిసిపోయే ప్రమాదం ఉంటుంది.

అంతేకాదు.. బ్యాంకు అధికారులమంటూ ఎవరైనా మీకు ఫోన్ చేసి మీ బ్యాంకు అకౌంట్ వివరాలు చెప్పమని లేదంటే మీ ఏటీఎం కార్డు బ్లాక్ అవుతుందని భయపెడతారు. తొందరపడి చెప్పకండి. వారు చెప్పింది నమ్మి మీ వివరాలు ఇచ్చారంటే.. సైబర్ కేటుగాళ్ల చేతికి తాళాలు ఇచ్చినట్టే అవుతుంది. ఏటీఎం కార్డు నెంబర్ లేదా 4 అంకెల పిన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, CVV నెంబర్ ఇలాంటివి ఏవీ చెప్పకూడదు.

ఇవి కూడా చదవండి : Telangana Governor : కొండరెడ్లపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన గవర్నర్‌ తమిళి సై.. ఎందుకో తెలుసా..?

Tiger Woods car accident: టైగర్‌వుడ్స్‌ కారు ప్రమాదానికి కారణం ఏంటో తెలుసా.? అసలు విషయం వెల్లడించిన పోలీసులు..