Attack with Knife: పటమటలో దారుణం చోటు చేసుకుంది. రామవరప్పాడులోని హనుమాన్‌నగర్‌లో గంజాయి మత్తులో స్నేహితుడిపై ఓ మైనర్ బాలుడు కత్తితో దాడి చేశాడు. ఓ చిన్న విషయంపై ఇద్దరి మధ్య వివాదం తలెత్తగా.. బాలుడు కోపంతో తన బాక్స్‌లో ఉన్న చిన్న కత్తితో మరో వ్యక్తిపై దాడి చేశాడు. దీంతో అతడి గొంతులో బలమైన గాయం కాగా.. వెంటనే పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లోకి పరుగెత్తి అపస్మారక స్థితిలో పడిపోయాడు. అతడిని గమనించిన స్థానికులు పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన బాలుడు పరారయ్యాడు.
దీనిపై సీఐ సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. సంఘటనా స్థలాన్ని పరిశీలించామని, మద్యం, గంజాయి తాగినట్లు ఆధారాలేవి దొరకలేదని తెలిపారు. బాలుడు పరారీలో ఉన్నాడని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పుకొచ్చారు. కాగా ఆ ప్రాంతంలో రోజూ గంజాయి తాగుతూ యువకులు భయాందోళనలకు గురి చేస్తున్నారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.