Guntur: పులిచింతల పునరావాస కేంద్రంలో దారుణం.. మైనర్ బాలికపై సామూహిక ఆత్యాచారం..

నిత్యం మహిళలపై దురాగతాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని బాలికలను చిదిమేస్తున్నారు.

Guntur: పులిచింతల పునరావాస కేంద్రంలో దారుణం.. మైనర్ బాలికపై సామూహిక ఆత్యాచారం..

Updated on: Aug 19, 2021 | 5:39 PM

Minor Girl Gang Rape: నిత్యం మహిళలపై దురాగతాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని బాలికలను చిదిమేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో జరిగిన ఈ దారుణం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజుపాలెంనకు చెందిన మైనర్ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పులిచింతల పునరావాస కేంద్రంలో మైనర్ బాలిక నివాసముంటోంది. ఒంటరిగా ఉన్న బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సామూహికంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి సంబంధించి బాలిక మేన మామ సాగర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also…  Kisan Reddy meets Jagan: విజయవాడ పర్యటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. తాడేపల్లిలో సీఎం జగన్‌తో భేటీ

Loading...
Unable to load recommendations.
Follow Us