ఏపీ మున్సిపల్ ఎన్నికలుః విజయవాడలో అధికారుల తనిఖీలు ముమ్మరం.. భారీగా నగదు పట్టివేత..!

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకుల మోత ఆగిపోయింది. ఇక తెరవెనుక ఏర్పాట్లు ఊపందుకున్నాయి. చాలాచోట్ల అదే జరుగుతోంది.

ఏపీ మున్సిపల్ ఎన్నికలుః విజయవాడలో అధికారుల తనిఖీలు ముమ్మరం..  భారీగా నగదు పట్టివేత..!

Updated on: Mar 09, 2021 | 6:43 AM

Cash Seized : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకుల మోత ఆగిపోయింది. ఇక తెరవెనుక ఏర్పాట్లు ఊపందుకున్నాయి. చాలాచోట్ల అదే జరుగుతోంది. ఎంత నిఘా ఉన్నా సైలెంట్‌గా పనికానిచ్చేస్తున్నారు. అక్కడక్కడా తనిఖీల్లో దొరుకుతున్న నోట్ల కట్టలు.. ప్రలోభాలను కళ్లకు కడుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయవాడలో పెద్దమొత్తంలో నగదు పట్టుబడింది.

విజయవాడలోని ఓ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజిత్‌సింగ్‌‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 57వ డివిజన్‌లోని న్యూ-రాజరాజేశ్వరిపేటకు చెందిన వెల్డర్‌ పిల్ల కూర్మనాయకులు అమరావతి కాలనీలోని మూడో రోడ్డులో నివాసముంటున్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో అతడి ఇంట్లో నగదు నిల్వచేశారనే సమాచారంతో టాస్క్‌‌ఫోర్సు, ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం రూ.48.44 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

కూర్మనాయకులు మాత్రం ఆ డబ్బంతా తనదేనని.. ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలనూ చూపిస్తానని చెప్పడంతో పోలీసులు ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పట్టుబడిన నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపని కారణంగా ఆ మొత్తాన్ని సీజ్‌ చేశామని స్థానిక పోలీసేులు తెలిపారు. నగదుకు సంబంధించిన పత్రాలను కూర్మ నాయకులు ఆదాయపన్ను శాఖ అధికారులకు చూపాల్సి ఉందన్నారు. డబ్బుతో పట్టుబడిన వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలోని గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ కార్పొరేటర్‌ అభ్యర్థికి సమీప బంధువుగా తెలుస్తోంది.

Read Also…  

Gold Price Today : స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

Silver Price Today : బంగారం వెంటే పరుగులు పెడుతున్న వెండి.. స్వల్పంగా పెరిగిన ధర.. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి