Mahesh Bank heist: మహేశ్‌ బ్యాంక్‌పై సైబర్‌ దాడి కేసులో కీలక పురోగతి.. ‘మనీ హైస్ట్’ లాగానే స్కెచ్

Ap Mahesh Bank: హైదరాబాద్‌లోని ఏపీ మహేశ్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకుపై సైబర్‌ కేటుగాళ్లు దాడి చేసిన సంగతి తెలిసిందే. సర్వర్‌లోకి చొరబడి గంటల వ్యవధిలో రూ.12.90 కోట్ల నగదును మాయం చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

Mahesh Bank heist: మహేశ్‌ బ్యాంక్‌పై సైబర్‌ దాడి కేసులో కీలక పురోగతి.. మనీ హైస్ట్ లాగానే స్కెచ్
జములు, ఇమ్మానుయేల్‌, షిమ్రాంగ్‌ (ఎడమ నుంచి కుడికి)

Updated on: Feb 02, 2022 | 12:16 PM

Mahesh Bank Servers Hacked: హైదరాబాద్‌(Hyderabad)లోని ఏపీ మహేశ్‌ బ్యాంక్‌పై సైబర్‌ దాడి(Cyber Attack) కేసులో మహా స్కెచ్ ఒక్కొక్కటిగా బట్టబయలవుతోంది. ఇది ఒక రోజులో హర్రీబర్రీగా వేసిన ప్లాన్ కాదు. చేసిన విత్ డ్రా కాదు. దీని ముందు వెనక పెద్ద ఎత్తున పాత్రధారులు- సూత్రధారులు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఈ దోపిడీ పీటముడి విడగొట్టేందుకు సీసీఎస్ పోలీసులు బ్యాచ్‌ల వారీగా విడిపోయి రంగంలోకి దిగారు. అందులో భాగంగా.. ఢిల్లీ(Delhi)- బెంగళూరు- పూణే- ముంబై సహా ఉత్తరాది రాష్ట్రాలకు సీసీఎస్ పోలీసు బృందాలు వెళ్లాయి. బెంగళూరులో ఇప్పటికే ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఇద్దరు నైజీరియన్లు జములు, ఇమ్మానుయేల్‌ మణిపురి యువతి షిమ్రాంగ్‌లను బెంగళూరులో సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు మంగళవారం తీసుకువచ్చి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. బెంగళూరులోని మరికొంతమంది నిందితులు ఉన్నారన్న సమాచారంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఢిల్లీలో మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇంతకీ ఈ మొత్తం బ్యాంక్ ఫ్రాడ్ ఎలా సాగింది? ఆ స్కెచ్ ఎలాంటిదని చూస్తే.. ఇక్కడ రూ.12.90  కోట్ల రూపాయలను మెయిన్ సర్వర్ నుంచి మూడు కరెంట్ అకౌంట్లలోకి దారి మళ్లించారు. తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లోని 128 సాధారణ ఖాతాల్లోకి ఈ డబ్బులు ట్రాన్స్ ఫర్ చేశారు. ఆయా ఖాతాల్లో పడ్డ క్యాష్ వెంటనే డ్రా చేశారు. ఇలా డ్రా చేసి ఇచ్చిన వారికి 10 నుంచి 15 శాతం వరకూ కమిషన్ ఇచ్చినట్టు గుర్తించారు.

పక్కా ప్లాన్ తోనే బ్యాంక్ ఖాతాలను సేకరించారు నిందితులు. పేద కుటుంబాలకు చెందిన యువత, విద్యార్ధులకు కమిషన్ ఎర వేసి ముగ్గులోకి దించారు కేటుగాళ్లు. వీళ్ల నుంచి తిరిగి డబ్బు వసూళ్లు చేసేందుకు ఇరవై మంది నైజీరియన్లను నియమించినట్టు చెబుతున్నారు పోలీసులు.

Also Read: AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే.. స్పష్టం చేసిన కేంద్రం