మదనపల్లె డబుల్ మర్డర్.. వెలుగు చూస్తున్న కొత్త ట్విస్టులు.. పద్మజతో పెద్ద కూతురు ఏం చెప్పింది.?

Madanapalle Incident: మదనపల్లె జంట హత్యల కేసుల పలు విస్తుపోయే నిజాలు బయటికి వస్తున్నాయి. తనని తాను కాళికగా భావించుకుంటున్న...

మదనపల్లె డబుల్ మర్డర్.. వెలుగు చూస్తున్న కొత్త ట్విస్టులు.. పద్మజతో పెద్ద కూతురు ఏం చెప్పింది.?
Madanapalle Incident

Updated on: Jan 30, 2021 | 10:40 AM

Madanapalle Incident: కన్నబిడ్డలను హతమార్చిన ఘటనలో విస్తుపోయే విషాయాలు బయటికి వచ్చాయి..ఈ నిజాలతో కేసులో మరో ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది..రుయా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించిన దంపతులకు వైద్య పరీక్షలు చేసే క్రమంలో వైద్యులతో పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు పురుషోత్తం నాయుడు.తనను తాను కాళిక అని భావించుకుని పద్మజ పెద్ద కుమార్తె అలేఖ్యని చంపిన తరువాత ఆమె నాలుకను కోసి తినేసిందని పురుషోత్తం నాయుడు చెప్పినట్లుగా సమాచారం.

అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది తెలిసే అవకాశం ఉంది. పద్మజ లాగా పెద్ద కుమార్తె అలేఖ్య కూడా తనకు అర్జునుడివని చెప్పేదని పురుషోత్తం నాయుడు వైద్యులకు తెలిపారు. అంతే కాదు కళాశాల లో పాఠాలు చెప్పడం నివృత్తి కాదు పాండవుల తరఫున అర్జునుడు ముందుండి నడిపిన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని తనకు చెప్పినట్లుగా ఆయన పేర్కొన్నారు.

కలియుగం అంతమై సత్య యుగం వస్తుందని, అందుకు కరోనా ని సూచన అని పెద్ద కుమార్తె అలేఖ్య చెప్పేదని పురుషోత్తం నాయుడు వైద్యులు తెలిపారు. ఇక తన కుమార్తె చెప్పిన విషయాలన్నీ నిజమేనని తెలిపిన తాను ఈ విషయాలన్నీ ఆధ్యాత్మిక పుస్తకాలలో చదివాను అంటూ వైద్యులకు వెల్లడించారు. పురుషోత్తం నాయుడు, పద్మజా ఇద్దరికీ మానసిక వ్యాధి లక్షణాలు కనిపించడంతో, జైలు అధికారులు వారిద్దరినీ తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడిన క్రమంలో కూడా పద్మజ నానా హంగామా చేశారు. ఇక వేరే గదిలో పురుషోత్తం నాయుడు ఏడుస్తూ వైద్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

ఇవి కూడా చదవండి:

”అమ్మో వీళ్ల పిచ్చి మాములుగా లేదుగా”.. రుయాకు మదనపల్లె జంట హత్యల కేసు నిందితులు.!

మదనపల్లె మరణాలపై మరో కోణం.. చెల్లి ఆత్మ కోసం అక్క ఆరాటం.. మిస్టరీగా మారుతున్న డబుల్ మర్డర్.!

”నేనే శివుడిని.. నాకు కరోనా రావడమేంటి” తల్లి పద్మజ వింత చేష్టలు.. 32 గంటల్లోనే మారిన సీన్..

మదనపల్లె డబుల్ మర్డర్.. కేసులో కొత్త ట్విస్ట్.. సీన్‌లోకి భూతవైద్యుడు ఎంట్రీ.. ఆ కొమ్ము ఊదింది ఎవరు.?