Madanapalle Incident: మదనపల్లె జంట హత్యల కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. రోజుకో కొత్త మలుపు తిరుగుతూ హత్యలపై ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సీన్‌లోకి భూత వైద్యుడు ఎంట్రీ ఇచ్చాడు. హత్యలు జరిగిన ఒక రోజు ముందు అంటే శనివారం నాడు భూత వైద్యుడితో పద్మజ పూజలు చేయించింది. దీనిపై బుగ్గకాలువకు చెందిన భూత వైద్యుడు సుబ్బరామయ్య మీడియాతో మాట్లాడారు.
తమ బంధువుల పిల్లలకు ఆరోగ్యం బాగోలేదంటూ భాస్కర్, రాజు అనే ఇద్దరు వ్యక్తులు తనని పద్మజ, పురుషోత్తం నాయుడు ఇంటికి తీసుకెళ్లారని ఆయన అన్నారు. తాను వాళ్ల ఇంటికి వెళ్లిన సమయంలో పైఅంతస్తు నుంచి ఓ అమ్మాయి బిగ్గరగా అరవడం వినిపించిందని చెప్పుకొచ్చారు.
మా పిల్లల ప్రవర్తనలో మార్పు వచ్చిందని.. వాళ్లకు మంత్రించాలని తల్లి పద్మజ కోరిందన్నారు. ఆమె చెప్పినట్లు ఇద్దరు పిల్లలకు మంత్రించానని.. దానికి వాళ్లు రూ. 300 ఇచ్చారన్నారు. అనంతరం శ్రీ వెంకటరమణ స్వామి గుడికి వెళ్లి పూజా సామాగ్రి, తాయత్తులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. అయితే గుడి నుంచి తిరిగి వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు ఎవరో సన్నటి వ్యక్తి ఇద్దరి అమ్మాయిల దగ్గర కూర్చుని చెవిలో శంఖం ఊదుతూ కనిపించాడని సుబ్బరామయ్య వివరించారు. కాగా, ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు.
అయితే మానసిక వైద్యులు మాత్రం పద్మజ, పురుషోత్తం నాయుడు డెల్యూషన్ అనే వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. ఈ వ్యాధిగ్రస్తులు తమకు తామే ఓ కొత్త లోకాన్ని సృష్టించుకుని అందులో బ్రతికేస్తున్నట్లు భ్రమలో ఉన్నారని వివరించారు. ఆ ఊహల్లో ఉండిపోవడం వల్లే వారు కన్నబిడ్డలను చంపుకున్నారని తెలిపారు.
”అమ్మో వీళ్ల పిచ్చి మాములుగా లేదుగా”.. రుయాకు మదనపల్లె జంట హత్యల కేసు నిందితులు.!
మదనపల్లె మరణాలపై మరో కోణం.. చెల్లి ఆత్మ కోసం అక్క ఆరాటం.. మిస్టరీగా మారుతున్న డబుల్ మర్డర్.!
”నేనే శివుడిని.. నాకు కరోనా రావడమేంటి” తల్లి పద్మజ వింత చేష్టలు.. 32 గంటల్లోనే మారిన సీన్..