విజయనగరంలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా ఝలిపించారు. రైతుల వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఎలక్ట్రికల్ డిపార్టుమెంటుకు చెందిన ఓ అధికారి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు.
బొండపల్లి ఎలక్రికల్ డిపార్ట్‌మెంటులో పని చేస్తున్న ఎలక్ట్రికల్ ఇంజనీర్ దాసరి మురళీమోహన్ రావు రైతుల వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పొలానికి విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం 10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
పొలానికి విద్యుత్ కనెక్షన్ కోసం గత కొంత కాలంగా రైతును తిప్పించుకుంటున్నారు. దరఖాస్తులన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ లంచం లేనిదే పని కాదని రైతుకు తెగేసి చెప్పాడు దీంతో ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన అధికారులు లంచం ఇస్తుండగా పట్టుకున్నారు.