Crime News: జగిత్యాల జిల్లాలో దారుణం.. ఎంపీవోపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన వ్యక్తి..

|

May 10, 2022 | 5:22 PM

జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం తుంగూర్ గ్రామములో దారుణం జరిగింది. ఇంటి రహదారి(Road) కోసం సర్వే నిర్వహిస్తుండగా ఎంపీవో(MPO), ఎస్సై(SI)తో పాటు పలువురిపై చుక్క గంగాధర్ అనే వ్యక్తి పెట్రోల్ పోశాడు...

Crime News: జగిత్యాల జిల్లాలో దారుణం.. ఎంపీవోపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన వ్యక్తి..
Petrol Attack
Follow us on

జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం తుంగూర్ గ్రామములో దారుణం జరిగింది. ఇంటి రహదారి(Road) కోసం సర్వే నిర్వహిస్తుండగా ఎంపీవో(MPO), ఎస్సై(SI)తో పాటు పలువురిపై చుక్క గంగాధర్ అనే వ్యక్తి పెట్రోల్ పోశాడు. పొలంలో మందు స్ప్రే చేసే డబ్బాలో పెట్రోల్ నింపి స్ప్రే చేసి నిప్పటించిన రైతు గంగాధర్. దీంతో ఎంపీవో రామకృష్ణరాజుకు నిప్పంటుకుని గాయాలయ్యాయి. సారంగాపుర్ ఎస్సై గౌతమ్ పవార్ సహా పలువురు అధికారులు తృటిలో తప్పించుకున్నారు. గాయపడిన ఎంపీవో రామకృష్ణరాజు జిల్లా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామకృష్ణ రాజును జిల్లా అడిషనల్ కలెక్టర్‌ బీఎస్‌ లత పరామర్శించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

గంగాధర్ ఇంటి వద్ద దారి విషయంలో కొంతకాలంగా వివాదం నడుస్తోంది. అదే విషయమై గంగాధర్.. రోడ్డుకు అడ్డంగా కట్టెలు పెట్టాడు. ఎవరు నడవకుండా దారి మూసేశాడు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఎస్సై గౌతమ్ పవర్, తహశీల్దార్ అరిపోద్దిన్, ఎంపీవో రామకృష్ణ వెళ్లారు. అప్పటికే పెట్రోల్​నింపిన స్ప్రేయర్‌తో ఉన్న గంగాధర్​.. అధికారులపై పెట్రోల్ పిచికారి చేశాడు. అతన్ని ఆపేందుకు ఎస్సై ప్రయత్నించినా.. విఫలమయ్యారు. అంతలోనే అక్కడే ఉన్న ఎంపీవోకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

Read Also.. Narayana Arrest: ఏపీలో మాల్‌ ప్రాక్టీస్‌ ప్రకంపనలు.. మాజీ మంత్రి నారాయణ సహా 60 మందిపై క్రిమినల్‌ కేసులు