అన్నను అతికిరాతకంగా చంపిన తమ్ముడు.. యాక్సిడెంట్ చేసి.. కుడికాలు నరికేసి.. కత్తితో పొడిచి.. పొడిచి

|

Mar 04, 2021 | 12:11 PM

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం అనేకాని పల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాల నెపంతో తోడబుట్టిన అన్నని అత్యంత పాశవికంగా వేటకొడవళ్లతో నరికి చంపాడు ఓ తమ్ముడు.

అన్నను అతికిరాతకంగా చంపిన తమ్ముడు.. యాక్సిడెంట్ చేసి.. కుడికాలు నరికేసి.. కత్తితో పొడిచి.. పొడిచి
Murder
Follow us on

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం అనేకాని పల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాల నెపంతో తోడబుట్టిన అన్నని అత్యంత పాశవికంగా వేటకొడవళ్లతో నరికి చంపాడు ఓ తమ్ముడు. తోడబుట్టిన మమకారం లేకుండా కారుతో యాక్సిడెంట్ చేసి, కుడికాలును నరికి వేసి విచక్షణారహితంగా పొడిచి చంపాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన స్వగ్రామానికి నడుచుకుంటూ వెళుతున్న హనుమంతు నాయక్ అనే వ్యక్తిని తన సొంత తమ్ముడు శంకర్ నాయక్ కారుతో యాక్సిడెంట్ చేశాడు. గాయాలతో బాధపడుతుంటే తగ్గని కోపంతో వెంట తెచ్చుకున్న వేటకొడవళ్లతో కుడి కాలు నరికి వేశాడు. కాలు వేరుపడి కొట్టుకుంటూ ఉండడంతో దూరంగా విసిరి వేసాడు. అంతటితో ఆగకుండా కత్తితో విచక్షణారహితంగా పొడిచి వేశాడు. దీంతో తీవ్ర గాయాలతో రక్తస్రావం జరిగి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటనపై స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

భూ విషయంలో ఘర్షణ..ఒకరు మృతి

కొమురం భీం జిల్లా దహెగాం మండలం కర్జీ గ్రామంలో బుధవారం విషాదం చేసకుంది. భూమి విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.  ఇరు వర్గాల సభ్యులు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఒడిల శంకర్‌(40)కు తీవ్రంగా గాయాలవడంతో స్పాట్‌లోనే మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. డెడ్‌బాడీని గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం బంధాలను, బంధుత్వాలను కూడా చూడకుండా సొంతవాళ్లనే అంతమొందిస్తున్నారు కొందరు.  ఇటువంటి ఘటనలు జరిగడం నిజంగా దురదృష్టం. భారతదేశంలో అందునా తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ బంధాలు అంటే చాలా గొప్పగా చెబుతూ ుంటారు. ప్రస్తుత ఘటనలే పదే, పదే జరుగుతూ ఉంటే.. భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

Also Read:

మీరు రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారా..? ఈ నంబర్ల ద్వారా ఫిర్యాదు చేయండి

పొలార్డ్​ ఊచకోత.. 6 బంతుల్లో 6 సిక్సర్లు.. యూవీ, హర్షెల్లే గిబ్స్ సరసన…