Maharashtra: శాస్త్రసాంకేతిక రంగంలో మనిషి ఎంతో అభివృద్ధి చెందుతున్నాడు. నింగికి నిచ్చెన వేస్తూ ఇతర గ్రహాలపై నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి తహతహలాడుతున్నాడు. కానీ కొందరి ఆలోచనలు మాత్రం ఇంకా పాతాలంలోనే ఉంటున్నాయి. చిన్న చిన్న కారణాలకే దేవుడిచ్చిన వందేళ్ల జీవితాన్ని అద్యాంతరంగా ముగించుకుంటున్నారు. ఎంత పెద్ద సమస్య అయినా ఆత్మహత్య పరిష్కారం కాదని చెబుతుంటారు. కానీ కొందరు మాత్రం సిల్లీ రీజన్స్‌కే తనువు చాలిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోని ముకుందన్ నగర్‌లో సామధాన్ సాబ్లే (24) అనే ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం అతనికి వివాహం అయింది. అయితే కొన్ని రోజులపాటు బాగానే ఉన్నా తర్వాత భార్య పట్ల అసంతృప్తిగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తీరా అతని గదిని పరిశీలించగా పోలీసులకు సూసైడ్ లెటర్ కనిపించింది. అందులో సామధాన్ తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాన్ని ప్రస్తావించాడు.
ఆ రీజన్ చదివిన పోలీసులు షాక్ అయ్యారు. భార్య సరిగా చీర కట్టుకోలేకపోతోందని, సరిగ్గా నడవడం లేదని, మాట్లాడటం లేదని సామధాన్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే సామధాన్ తన కంటే వయసులో ఆరేళ్లు పెద్దదైన మహిళను వివాహం చేసుకున్నట్లు తెలిపిన ముకుంద్వాడీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..