Fire Accident: తమిళనాడు నామక్కల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 10 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా..

Tamil Nadu Fire Accident: తమిళనాడు నామక్కల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాశిపురం లోని ప్రైవేట్ పసుపు తయారీ కంపెనీలో

Fire Accident: తమిళనాడు నామక్కల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 10 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా..

Updated on: Feb 04, 2021 | 9:54 AM

Tamil Nadu Fire Accident: తమిళనాడు నామక్కల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాశిపురం లోని ప్రైవేట్ పసుపు తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘటనా వద్ద మంటలు ప్రమాదకరంగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా రూ.10 కోట్ల మేర ఆస్తి నష్టం జరగినట్లు అంచనా వేస్తున్నారు. కాగా ప్రమాదానికి సంబంధించి కారణాలు ఇంకా తెలియరాలేదు.