Crime News: బీహార్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. వరుసకు తాత అయ్యే వృద్ధుడు మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. మూడు రోజుల క్రితం హాజీపూర్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన 60 ఏళ్ల వృద్ధుడిని హాజీపూర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. డిసెంబరు 16న ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంటి టెర్రస్‌పై వరుసకు తాత అయ్యే వృద్ధుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. గాయపడిన చిన్నారిని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
నిందితుడిని సమస్తిపూర్ జిల్లా సరైరంజన్ గ్రామానికి చెందిన వినోద్ భగత్ అలియాస్ వినోద్ భండారీగా పోలీసులు గుర్తించారు. నిందితుడు.. తన మేనకోడలి వివాహానికి హాజరయ్యేందుకు హాజీపూర్ వచ్చాడని పోలీసులు తెలిపారు. అత్యాచారం బాధితురాలు వినోద్ పెద్ద మేనకోడలు కూతురు. బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించడంతో శనివారం ఈ విషయం వెలుగులోకి వచ్చిందని ఎస్‌డీపీఓ రాఘవ్ దయాల్ తెలిపారు.
అయితే.. ఆసుపత్రికి అయ్యే ఖర్చు భరించడానికి వృద్ధుడు అంగీకరించడంతో.. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని దాచడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ ఘటనకు సంబంధించి మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు అనంతరం నిందితుడిని అరెస్టు చేసినట్లు మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో పుష్పాకుమారి తెలిపారు.
Also Read: School Teacher: స్కూల్ వాట్సప్ గ్రూప్‌లో పోర్న్ వీడియోల కలకలం.. టీచర్‌పై కేసు నమోదు..!
AP Road Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళా కూలీల మృతి..