Kanwar devotees dead: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుసుకుంది. కన్వర్ బక్తులను ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన యూపీలోని సదాబాద్ పీఎస్ పరిధిలోని బదర్ గ్రామం వద్ద అర్ధరాత్రి చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన కన్వర్ భక్తులపై ట్రక్కు దూసుకెళ్లడంతో ఆరుగురు భక్తులు మరణించారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 2.15 గంటలకు జరిగిందని ఆగ్రా జోన్ ఏడీజీ రాజీవ్ కృష్ణ తెలిపారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌కు చెందిన భక్తులు హరిద్వార్ నుంచి తమ స్వస్థలానికి వెళుతుండగా ట్రక్కు వారిపైకి దూసుకెళ్లిందని పేర్కొన్నారు. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆసుపత్రిలో చనిపోయినట్లు తెలిపారు. భక్తుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆగ్రా మెడికల్ కాలేజీకి తరలించారు.
పవిత్ర శ్రావణ మాసంలో జరిగే కన్వర్ యాత్రలో భాగంగా పరమ శివుని భక్తులు.. ‘కన్వరియాలు’ గంగా నది ఒడ్డుకు వెళ్లి తమ ఇళ్లలో లేదా దేవాలయాలలో నైవేధ్యంగా సమర్పించడానికి నీటిని తీసుకువెళ్తారు. గంగా నది నీటిని తీసుకొచ్చేందుకు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, రిషికేశ్, గౌముఖ్, తదితర ప్రదేశాలకు ఏటా భక్తులు కాలినడకన కన్వర్ యాత్ర చేపడతారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్ల నుంచి కన్వర్ యాత్ర నిర్వహించలేదు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇటీవలనే ఈ యాత్ర ప్రారంభమైంది.
UP | 5 dead after Kanwar devotees from MP’s Gwalior were mowed down by a truck in Hathras district during early hours, today pic.twitter.com/8UZjFzZMJM
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 23, 2022
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..